Begin typing your search above and press return to search.

మోడీ సర్కారుపై కేటీఆర్ తాజా క్వశ్చన్.. కోటి అనుమానాలు కలిగేలా చేశారుగా?

By:  Tupaki Desk   |   4 May 2022 5:09 AM GMT
మోడీ సర్కారుపై కేటీఆర్ తాజా క్వశ్చన్.. కోటి అనుమానాలు కలిగేలా చేశారుగా?
X
ఎవరేమన్నా సరే.. తాము అనుకున్నది మాత్రమే చేసే ప్రభుత్వాలు ఈ మధ్యన ఎక్కువ అయ్యాయి. గతంలో ఏదైనా ప్రభుత్వం మీద ప్రజల నుంచి విమర్శలు.. ఘాటు ఆరోపణలు వ్యక్తమవుతుంటే.. ఆత్మరక్షణలో పడి.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేయటం కనిపిస్తుంది. అందుకు భిన్నంగా.. మీరేం అనుకుంటే అనుకోండి. నాకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించటం ఈ మధ్యన అలవాటైంది.

ఇది సామాన్యులకే కాదు.. ప్రభుత్వాలు కూడా ఇలానే చేస్తున్నాయి. ప్రభుత్వ పాలసీలు ఏ మాత్రం బాగోలేకున్నా.. వాటిని వ్యతిరేకించే గుణం కూడా ఉంటుంది. ఒకవేళ ఆ రచ్చ పెరిగి పెద్దది అయితే.. దానికి సమాధానం చెప్పక తప్పని పరిస్థితి ఎదురవుతుంది.

ఎక్కడైనా నష్టాలతో ఉక్కిరిబిక్కిరి పడుతున్న సంస్థను అమ్మకానికి పెట్టేసిన వైనం కనిపిస్తుంటుంది. అంతేకానీ.. లాభాల దౌడు తీస్తున్న కంపెనీని అమ్మకానికి పెట్టటం ఒక ఎత్తు అయితే.. తాజాగా కేంద్రంలోని మోడీ సర్కారు అమ్మకానికి పెట్టి.. తాజా డీల్ కు ఓకే అనేసిన వైనంపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇంతకీ ఈ అమ్మకాలకు కర్త కర్మ క్రియ మొత్తం మోడీ సర్కారే. ఈ మాటకు మరో అవకాశమే లేదు. ఇంతకీ జరిగిందేమంటే.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవన్ హన్స్ కంపెనీ విలువ దాదాపు రూ.3700 కోట్లుగా చెబుతారు. ఇందులో 49 శాతం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటే.. మిగిలిన 51 శాతం ఓఎన్జీసీ వద్ద షేర్లు ఉన్నాయి. ఈ కంపెనీలో కేంద్రం తన వాటాను అమ్మకానికి పెట్టేసిన వైనంపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ అనుమానాలకు బలం చేకూరేలా తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కీలక పాయింట్లను ఇప్పుడు సోషల్ మీడియా సాక్షిగా సంధించారు. అందులో ముఖ్యమైనది 2017లోనే పవన్ హన్స్ కంపెనీ విలువ రూ3700 కోట్లు ఉండేది. అలాంటి కంపెనీని లక్ష రూపాయిల కంపెనీకి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. మరో సందేహం ఏమంటే.. రూ.3700 కోట్ల విలువైన కంపెనీలో 49 శాత వాటాను రూ.211 కోట్లకు అమ్మటం ఎలా సాధ్యమైందన్నది మరో ప్రశ్న.

హోలికాఫ్టరర్లను అద్దెకు ఇచ్చే పవన్ హాన్స్ కంపెనీలో భారత ప్రభుత్వం.. ఓఎన్జీసీ కలిసి 51-49 నిష్ఫత్తిలో వాటా ఉండగా.. తాజాగా సంధిస్తున్న ప్రశ్నల్లో కీలకమైనది.. హన్స్ ఇండియాసంస్థ చేసే తరహా వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేని కంపెనీకి ఎలా కట్టబెడతారు? అన్నది మరో క్వశ్చన్. అంతేకాదు.. కేవలం ఆర్నెల్ల క్రితం రూ.లక్షతో మొదలైన కంపెనీకి పవన్ హన్స్ ను ఎలా కట్టబెడతారన్నది మరో ప్రశ్న. ఇలా.. ఈ మొత్తం డీల్ పై బోలెడన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తనకున్న సందేహాల్ని సంధిస్తూ టీ మంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ సోషల్ మీడియాలో సంధించిన ప్రశ్నకు.. మోడీ సర్కారు ఏమని బదులిస్తుందో చూడాలి.