Begin typing your search above and press return to search.
నెగిటివ్ ను పాజిటివ్ గా మార్చే మేజిక్ కేటీఆర్ కు ఎంత బాగా తెలుసో?
By: Tupaki Desk | 4 Oct 2021 7:00 PM ISTప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవటం అందరికి సాధ్యం కాదు. అందునా పవర్ చేతిలో ఉన్న పొలిటిషియన్లలో చాలా మందికి ఆ ఆర్టు అస్సలు ఉండదు. వారి ఇగో వారి చేత తప్పులు చేయిస్తూ ఉంటుంది. కానీ.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కాస్త భిన్నం. ఆయనకు నెగిటివ్ ను పాజిటివ్ గా మార్చుకోవటం ఎలానో తెలుసు. తాజాగా తనకున్న సదరు నైపుణ్యాన్ని ఆయన మరోసారి ప్రదర్శించారు.
గాంధీ జయంతి సందర్భంగా బాపూఘాట్ వద్ద కేటీఆర్ వాహనం రాంగ్ రూట్ లో వస్తున్న వేళ.. ట్రాఫిక్ ఎస్ఐ.. కానిస్టేబుల్ దాన్ని ఆపటం.. ఈ సందర్భంగా అక్కడి టీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఇష్యూను సర్దిచెప్పటం తెలిసిందే. అయితే.. ఈ ఉదంతం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఇదే సమయంలో కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. కేటీఆర్ వాహనం పోలీసులకు తెలీకపోవటం ఏమిటి? ఆయన కాన్వాయ్ వస్తుంటే.. ట్రాఫిక్ ముందుగానే క్లియర్ చేస్తారు కదా? అలాంటప్పుడు రాంగ్ రూట్.. రైట్ రూట్ అంటూ ఏమీ ఉండదు కదా? లాంటి ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి.
అయితే.. బాపూ ఘాట్ వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చిన కేటీఆర్.. తన రెగ్యులర్ వెహికిల్ కాకుండా మరో వాహనంలో రావటం.. ఆయన ఈ మధ్యన వెన్నునొప్పితో బాధ పడుతున్నవేళ అందుకు తగ్గట్లుగా సీటు మార్చిన వాహనాన్ని అప్పుడప్పుడు వాడుతున్నారు. ఇక.. ఆయన్ను బాపు ఘాట్ వద్ద దించిన తర్వాత.. వాహనాన్ని పక్కన పెట్టేందుకు డ్రైవర్ రాంగ్ రూట్ లో తీసుకెళ్లారు. అతను కొత్తగా విధుల్లోకి చేరినట్లు చెబుతారు. అదే సమయంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయ కాన్వాయ్ రావటం.. కేటీఆర్ వాహనం అని తెలీక పోలీసులు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. అది కాస్తా మీడియా కంట్లో పడటం.. వార్తగా టెలికాస్ట్ అయ్యింది. ఈ విషయం మీద కేటీఆర్ ను సోషల్ మీడియా వేదిక మీద క్లారిటీ ఇవ్వాలని పలువురు కోరారు. కానీ.. .ఆయన స్పందించలేదు.
కట్ చేస్తే.. ఈ రోజు ఆయన తన వాహనాన్ని ఆపిన ఎస్ఐ.. కానిస్టేబుల్ ను తన కార్యాలయానికి పిలిపించుకొని మరీ అభినందించటం.. శాలువా కప్పి అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించే ఎస్ఐ ఐలయ్య.. కానిస్టేబుల్ వెంకటేశ్వర్లను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. అంతేకాదు తన వాహనానికి విధించిన చలాన్ సైతం చెల్లించారు. తమ పార్టీ కార్యకర్తలకు.. నేతలకు సరైన సందేశాన్ని ఇచ్చేందుకు ట్రాఫిక్ సిబ్బందిని మంత్రి కేటీఆర్ అభినందించారని చెబుతున్నారు. దీంతో.. ఈ అంశం మీద ఇప్పటివరకు ప్రశ్నించే వారు కాస్తా.. ఆయన్ను ప్రశంసిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. తన మీద వచ్చే నెగిటివ్ ను కేటీఆర్ పాజిటివ్ గా ఎలా మార్చుకున్నారో అర్థమైంది కదా?