Begin typing your search above and press return to search.

కేబినెట్ లో పెద్దోడు ఇంద్రకరణ్.. చిన్నోడు కేటీఆర్.

By:  Tupaki Desk   |   9 Sept 2019 12:37 PM IST
కేబినెట్ లో పెద్దోడు ఇంద్రకరణ్.. చిన్నోడు కేటీఆర్.
X
ఎంతగానో ఎదురుచూసిన రోజు వచ్చి.. వెళ్లిపోయింది కూడా. ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత.. కీలకమైన కొడుక్కి.. మేనల్లుడికి మంత్రిపదవులు ఇవ్వనకుండా తొమ్మిది నెలల పాటు కాలాన్ని గడిపేసే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే.. అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే అవుతారు.

అధికారంలో లేనప్పుడు ఇవ్వలేని పదవులు.. పవర్ చేతిలోకి వచ్చినప్పుడు పోస్టులు ఇచ్చే అవకాశం ఉన్నా.. ఇవ్వకుండా తన దగ్గరకే ఉంచుకునే గుణం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు చంద్రుళ్లకు కాస్త ఎక్కువనే చెబుతారు. ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్ని ఆదివారం భర్తీ చేయటం ద్వారా.. పూర్తిస్థాయి కేబినెట్ కొలువు తీరినట్లు అయ్యింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మొత్తం 18 మంది ఉన్న మంత్రివర్గంలో అత్యంత పెద్ద వయస్కుడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిగా చెప్పాలి. ఆయన వయసు 70 సంవత్సరాలు. ఆయన తర్వాత పెద్ద వయస్కులు మహమూద్ అలీ. ఆయనకు 67 ఏళ్లు. ఆ తర్వాత స్థానం మంత్రి మల్లారెడ్డిది. ఆయనకు 66 ఏళ్లు.

ఇదిలా ఉంటే.. మంత్రి వర్గంలో అత్యంత పిన్నవయస్కుడు కేటీఆర్ గా చెప్పాలి. ఆయన వయసు 43 ఏళ్లు మాత్రమే. కేటీఆర్ తర్వాత యాభై లోపు వయసు ఉన్న మంత్రుల్లో హరీశ్ రావు నిలుస్తారు. ప్రస్తుతం ఆయన వయసు 48 ఏళ్లు మాత్రమే. కేసీఆర్ మంత్రి వర్గంలోని మంత్రుల సగటు వయసు చూస్తే 59 ఏళ్లు కావటం గమనార్హం. కేసీఆర్ కేబినెట్ ను చూస్తే.. యువరక్తం తక్కువగా.. పెద్దరికం పాళ్లు ఎక్కువగా కనిపించక మానదు.