Begin typing your search above and press return to search.
అక్కడ నెక్ట్స్ ముఖ్యమంత్రి కేటీఆరే!
By: Tupaki Desk | 12 March 2018 10:45 AM ISTఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చినబాబు నారా లోకేష్ ఎలాగో...? తెలంగాణ రాష్ట్రానికి అలాగే చినబాబు హోదా కేటీఆర్ ది! కాకపోతే.. 2019 ఎన్నికల సమయానికి అక్కడ చినబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారనే అంచనాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చురుగ్గా షికారు చేస్తున్నాయి. మరోవైపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మంత్రి పదవిని నడపడంలోనే కిందామీదా అయిపోతున్నాడు మరి!
తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కేసీఆర్.. ప్రస్తుతానికి చాలా హాయిగా, ఎలాంటి ఒత్తిడీ లేకుండా పరిపాలన సాగిస్తున్నప్పటికీ.. రాజకీయ వారసుడిగా ఆయన తర్వాత సీఎం కుర్చీని అధిష్టించేది ఎవరు? అనే చర్చ పార్టీలో చాలాకాలంగా ఉంది. ‘ఆయన తర్వాత’ అనే ప్రశ్న ఇప్పుడే ఎందుకు అని పలువురు అనుకుంటున్నారు గానీ.. వాస్తవంలో.. ఆ చర్చ ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమవుతోంది.
కేసీఆర్ 2019 తర్వాత తాను పూర్తిగా జాతీయ రాజకీయాలకే పరిమితం కాబోతున్నా అంటూ స్పష్టమైన ప్రకటన చేసేశారు. కేంద్ర రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి.. తాను ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు నడుపుతానని ఆయన సెలవిచ్చేశారు. ప్రధాని అనే మాట చెప్పలేదు తప్ప.. గుజరాత్ సీఎం నుంచి మోడీ ప్రధాని అయినట్లుగా.. తాను కూడా ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్తా అని ప్రకటించారు.
ఇక 2019 ఎన్నికల తర్వాత.. రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు అనే చర్చ సహజంగానే జరుగుతుంది. ఆ చాన్స్ కేటీఆర్ దే అని పార్టీలో పలువురు అంటున్నారు. గులాబీ బాస్ వారసుడు కేటీఆరే అని గతంలో కవిత కూడా పలు సందర్భాల్లో చెప్పారు. కేసీఆర్ అల్లుడు హరీష్ రావులో అసంతృప్తి ఉన్నదంటూ కొన్ని పుకార్లు కూడా వచ్చాయి. ఆయన భాజపాలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా.. తెరాస చీలుతుందన్నట్లుగా.. కూడా కొన్ని పుకార్లు వ్యాపించాయి. అయితే హరీష్ రావు.. తాను చచ్చేదాకా తెరాసలోనే ఉంటానని ప్రకటించి.. ఈ పుకార్లకు తెరదించారు. హరీష్ రావు గనుక.. ఎలాంటి అసంతృప్తికి లోనుకాకుండా ఉండేట్లయితే.. కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం లో ఎలాంటి సందేహం లేదని.. ఒకవేళ అసంతృప్తి ఉన్నా కూడా.. ఆయనే ముఖ్యమంత్రి అవుతారని.. పలువురు చెబుతున్నారు. కేసీఆర్- కేవలం ఒకే టర్మ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి.. ఆ వెంటనే కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిపోవడం అనేది.. కేవలం తన కొడుకుకు లైన్ క్లియర్ చేసి.. అంతా సవ్యంగా అప్పగించడానికే అని పలువురు అంచనా వేస్తున్నారు.