Begin typing your search above and press return to search.

కేటీఆర్ సార్‌కి కోప‌మొచ్చింది.. ఒక్క‌సారి గ‌తం చూద్దామా?

By:  Tupaki Desk   |   13 April 2021 10:30 AM GMT
కేటీఆర్ సార్‌కి కోప‌మొచ్చింది.. ఒక్క‌సారి గ‌తం చూద్దామా?
X
ఏ మాట‌కామాటే చెప్పుకోవాలి. మంచిని మంచిగా చెడును చెడుగా చెప్పుకోవ‌డం.. రాజ‌కీయ నేత‌ల‌కు ఎలా గూ అల‌వాటు లేదు. బ‌హుశ అందుకేనేమో.. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఈ మంచి-చెడుల ప్ర‌స్తావ‌న తెర‌మీదికి వ‌చ్చింది. పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియా జ‌నాలు.. రాజ‌కీయ కామెంట్ల‌ను తెర‌మీదికి తెస్తున్నారు. స‌రే.. ముందు తాజా విష‌యంలోకి వెళ్తే.. సాగ‌ర్అసెంబ్లీ స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక నేప‌థ్యంలో బీజేపీ నేత‌లు భారీ ఎత్తున ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. స‌న్నాసి.. ద‌గుల్బాజీ.. అంటూ.. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు సైతం బీజేపీ నేత‌ల నోటి నుంచి వ‌స్తున్నాయి.

వాస్త‌వానికి రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు ప్ర‌తి విమ‌ర్శ‌లు కామ‌నే అయినా.. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌ను ఎవ‌రూ స‌హిం చ‌రు. కానీ, తెలంగాణ ఉద్య‌మం ప్రారంభ‌మైన నాటి నుంచి అక్క‌డ ఈ వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు కామ‌న్‌గా మా రాయి. అయితే.. తాజాగా బీజేపీ నేత‌లు చేసిన వ్య‌క్తిగ‌త కామెంట్ల‌పై మంత్రి, కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ ఫైర‌య్యారు. ``వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు చేస్తారా? కేసీఆర్ గారు సీఎం అనే విష‌యాన్ని మ‌రిచిపోతున్నారా? ఆయ‌న స్థాయేంటి? ఆయ‌న హోదా ఏంటి? ఇలాంటి విమ‌ర్శ‌లు చేస్తారా? స‌న్నాసులు, దౌర్భాగ్యులు`` అంటూ.. విరుచుకుప‌డ్డారు.

నిజమే.. కేటీఆర్ ఆవేద‌న‌లోను, ఆక్రోశంలోనూ అర్ధం ఉంది. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, స్థాయిని మ‌రిచిన మాట లు స‌హించ‌లేం. కానీ, ఇప్పుడు ఏ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారో.. ఇప్పుడు ఏ స్థాయిలో ఆక్రోశం వెళ్ల‌గ‌క్కుతు న్నారో.. అదే కేటీఆర్‌.. ఆ నాలుగేళ్ల వెన‌క్కి వెళ్తే.. ``నీవు నేర్పిన విద్య‌యే క‌దా` అనే వ్యాఖ్య సోష‌ల్ మీడి యాలో వినిపిస్తోంది. స‌న్నాసులు.. ద‌గుల్బాజీలు.. అనే ప‌దాల‌ను తెలంగాణ రాజ‌కీయాల‌కు ప‌రిచ‌యం చేసింది ఎవ‌రు? ఉద్య‌మ స‌మ‌యంలో.. అధికార పార్టీ నేత‌ల‌ను ఏ ర‌కంగా దూషించారో.. కేటీఆర్ మ‌రిచిపోయారా? అప్ప‌ట్లో ఏ ర‌కంగా వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశారో.. గుర్తు లేవా? అనేది.. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న కామెంట్లు.

ఎవ‌రు, ఏ పార్టీ నేత‌లు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసినా.. స‌హించ‌కూడ‌దు.. అనే సూత్రాన్ని ఎప్పుడో వ‌దిలేసిన ‌.. టీఆర్ ఎస్‌.. నేడు బాధ‌ప‌డ‌డంలో ఎలాంటి ప‌స లేద‌ని కూడా అంటున్నారు. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు.. సిద్ధాం తాల‌ను వ‌దిలేసి.. తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకుని ముందుకు సాగిన విధానం వంటివి ముందు నేర్పిందే టీఆ ర్ ఎస్ అనే విష‌యాన్ని ఎలా మ‌రిచిపోతున్నారు? అనే ప్ర‌శ్న వ‌స్తోంది. ఇప్ప‌టికైనా.. మార్పు అవ‌స‌ర‌మ‌ని భావిస్తే.. ముందు మారాల్సింది.. అధికార పార్టీ నేత‌లే. ఏ మంత్రి నోరెత్తినా.. స‌న్నాసులు.. అంటూ.. మొద‌లు పెడుతున్న సంస్కృతి మార్చుకుని.. ప్ర‌తిప‌క్ష నేత‌లు కూడా అలానే ఉంటే బాగుంటుంద‌ని ఆశించ‌డం త‌ప్పుకాదు.

కానీ.. మాకు మాత్ర‌మే తిట్టే స్వేచ్ఛ ఉంద‌ని అంటే.. అంద‌రూ రాజ‌కీయ నేత‌లే.. క‌నుక‌.. అంద‌రిదీ అదే స్కూల్ కాబ‌ట్టి స‌ర్దుకుపోవ‌డ‌మే బెస్ట్‌!! ఇది ఎవ‌రినీ స‌మ‌ర్దించ‌డం కాదు.. ఎవ‌రినీ నెత్తిన పెట్టుకోవ‌డం కాదు.. కానీ.. ఇప్ప‌టికైనా..ప‌రిస్థితి మారాల‌ని.. హుందా రాజ‌కీయాలు కోరుకుంటే.. కేటీఆర్ త‌న పార్టీ నుంచే ఆ స‌ర్దుబాటును ప్ర‌ద‌ర్శించాల‌నేది సోష‌ల్ మీడియా ప్ర‌ధాన సూచ‌న. మ‌రి ఏం చేస్తారో చూడాలి.