Begin typing your search above and press return to search.

రెచ్చిపోండి.. టీఆర్ఎస్ కార్యకర్తలకు కేటీఆర్ సంచలన పిలుపు

By:  Tupaki Desk   |   10 Nov 2021 9:00 AM IST
రెచ్చిపోండి.. టీఆర్ఎస్ కార్యకర్తలకు  కేటీఆర్ సంచలన పిలుపు
X
బీజేపీ బలం.. బలగం అంతా సోషల్ మీడియానే. దాన్నే బేస్ చేసుకొని ప్రత్యర్థులను చెడుగుడు ఆడేస్తుంటారు. ఈ క్రమంలోనే గులాబీ దండు కూడా ఇప్పుడు దానికి సిద్ధమవుతోంది. సోషల్ మీడియాలో టీఆర్ఎస్ కార్యకర్తలు విజృంభించి బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చాడు.

కేంద్రమే వరి కొనుగోలు చేయాలంటూ ఈనెల 12న ఆందోళనలు నిర్వహించి బీజేపీ మెడలు వంచే విధంగా ధర్నా చేయాలని కేటీఆర్ సూచించారు. కామారెడ్డిలో ఈరోజు జరిగిన నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పరిపాలన, సంస్కరణలు, సంక్షేమం, అభివృద్ధి పనుల్లో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు. తెలంగాణ పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని.. రాష్ట్రంలో జరుగుతు్న అభివృద్ధి పనులు బీజేపీ నేతలకు కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు.

వరిధాన్యం కొనలేమని కేంద్రమే రాష్ట్రాలకు లేఖ రాసిందని కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేసీఆర్ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని.. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వంటి ప్రధాన పార్టీలను గట్టిగా ఎదుర్కొన్న ఘనత ఆయనదని కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని.. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ నాయకులు ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు, కరెంట్ షాక్ లు, రైతు ఆత్మహత్యలు ఉండేవని ఆయన దుయ్యబట్టారు.

ఇక కామారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు తరలిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆసరా పింఛన్లు 10 రెట్లు పెంచామని.. బీడీ కార్మికులు, ఒంటరి మహిళకు దేశంలోనే తొలిసారిగా పింఛన్లు ఇస్తున్నామని కేటీఆర్ చెప్పారు.