Begin typing your search above and press return to search.

మైక్రోసాఫ్ట్ ఆఫీసులో కేటీఆర్ ఏం చేశారు?

By:  Tupaki Desk   |   27 March 2018 10:39 AM IST
మైక్రోసాఫ్ట్ ఆఫీసులో కేటీఆర్ ఏం చేశారు?
X
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఐటీ దిగ్గ‌జ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు వెళ్లారు. కాకుంటే.. అమెరికా కాదు.. హైద‌రాబాద్ లోని కార్యాల‌యానికి. వినూత్న ఆవిష్క‌ర‌ణ‌ల కేంద్రంగా చెప్పే మైక్రోసాఫ్ట్ గ్యారేజ్ ను ఆయ‌న స్టార్ట్‌చేశారు. కొత్త ప‌ద్ద‌తుల్లో స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించ‌టానికి.. ప్ర‌యోగాలు చేయ‌టానికి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచే ఈ గ్యారేజ్ ను గ‌చ్చిబౌలిలో కంపెనీ క్యాంప‌స్ లో స్టార్ట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి కేటీఆర్ హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మైక్రోసాఫ్ట్ హైద‌రాబాద్ ప్రాంగ‌ణంలో నాలుగో ట‌వ‌ర్ నిర్మిస్తామ‌న్నారు. మైక్రోసాఫ్ట్ ఇప్ప‌టికే లీజు ప‌ద్ద‌తిలో తీసుకున్న క్యాంప‌స్ లో 1500 మంది ప‌ని చేస్తున్నార‌ని.. మ‌రింత‌గా సంస్థ‌ను విస్త‌రించాలంటే కొత్త భ‌వ‌నం అవ‌స‌రమ‌ని చెప్పారు. కొత్త ట‌వ‌ర్ కార‌ణంగా 2500 మందికి ఉపాధి ల‌భించ‌నున్న‌ట్లు చెప్పారు. మైక్రోసాఫ్ట్ గ్యారేజ్ త‌ర‌హాలో కొత్త త‌ర‌హా ఆవిష్క‌ర‌ణ‌ల కోసం తెలంగాణ రాష్ట్రం టీ వ‌ర్క్స్ ప్రాజెక్టును అమ‌లు చేస్తున్న‌ట్లు చెప్పారు.

ఇంత‌కీ మైక్రోసాఫ్ట్ గ్యారేజ్ ఏమిటి? దాని ప్ర‌త్యేకత ఏమిటంటే.. సంస్థ‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల్లో కార్యాల‌యాలు ఉన్నా.. గ్యారేజ్ ఉన్నది మాత్రంప్ర‌పంచంలోని నాలుగుచోట్లే. అందులో ఒక‌టి హైద‌రాబాద్ లో ఉండ‌టం గ‌ర్వ‌కార‌ణంగా చెప్పాలంటున్నారు. 2009లో తొలి గ్యారేజ్ ను మైక్రోసాఫ్ట్ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఏర్పాటు చేయ‌గా.. తాజాగా హైద‌రాబాద్ లో స్టార్ట్ చేశారు. ఈ రెండుచోట్ల కాకుండా కెన‌డాలోని వాంకోవ‌ర్‌.. ఇజ్రాయెల్ లోని హ‌ర్డీలియాలో.. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఏర్పాటు చేశారు. హైద‌రాబాద్ లో స్టార్ట్ చేసిన గ్యారేజ్ ఐదోదిగా చెప్పాలి.

రానున్న రోజుల్లో బెంగ‌ళూరులో కూడా ఇదే త‌ర‌హా గ్యారేజ్ ను ఏర్పాటు చేయ‌నున్నారు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. రానున్న రోజుల్లో టెక్నాల‌జీ మొత్తం ఆగ్మెంటెడ్ రియాలిటీ.. వ‌ర్చువ‌ల్ రియాలిటీ.. త్రీడీ ప్రింటింగ్ తో పాటు ఇత‌ర ఫ్యూచ‌ర్ డిమాండ్ ఉన్న ప్రాజెక్టులపైన హైద‌రాబాద్ కేంద్రంలో ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హించ‌నున్నారు.

హైద‌రాబాద్ లో స్టార్ట్ చేసిన గ్యారేజ్ లో.. దృష్టి స‌మ‌స్య‌లు ఉన్న వారికి యాప్ లు త‌యారు చేయ‌టం.. ఎస్ ఎంఎస్ ఇన్ బాక్స్ ను ఆర్గ‌నైజ్ చేసే యాప్ ను..ఇష్ట‌మైన హెచ్ డీ క్వాలిటీ వాల్ పేప‌ర్లు పంపే యాప్‌.. ఎక్కువ మంది క‌లిసి ప‌ని చేసుకోవ‌టానికి.. మొబైల్ సాయంతో ఎక్కువ మంది క‌మ్యూనికేష‌న్ చేసుకునేందుకు వీలుగా ఉండే కైజాలా యాప్ ను హైద‌రాబాద్ గ్యారేజ్ లో డెవ‌ల‌ప్ చేస్తారు.