Begin typing your search above and press return to search.
పిల్లాడి ఫజిల్ కు ఫిదా అయిన కేటీఆర్
By: Tupaki Desk | 21 Jun 2018 2:57 PM IST‘ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది’.. ఇది తెలుసు కనుకే ఓ పెద్ద టెలికాం కంపెనీ తమ ప్రచార ట్యాగ్ లైన్ గా దీన్ని ఎంచుకుంది. ఈ ప్రపంచంలో అన్ని ప్రశ్నలకు ఏదో ఒక సమాధానం ఉంటుంది. అలాగే అన్ని చిక్కుముడులకు కూడా ఏదో ఏదో దారి ఉంటుంది. ఆ దారిని వెతుక్కుంటూ వెళితేనే మన గమ్యం చేరగలం. అది మంచి దారా.. చెడ్డ దారా అన్నది కాకుండా లక్ష్యం చేరామన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. జీవిత మనుగడకు ఇది ఎంతో అవసరం..
ఇప్పుడు ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్వీట్ ద్వారా అందరికీ తెలియజేశాడు. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే కేటీఆర్ తన పర్యటనలు - ప్రభుత్వ విశేషాలే కాదు.. అప్పుడప్పుడు సరదా సరదా సంఘటనలు కూడా షేర్ చేస్తుంటారు.. తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ వదిలారు. ఇది అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కేటీఆర్ తాజాగా చేసిన ఓ ట్వీట్.. ఓ టీచర్ తన స్టూడెంట్ కు ఫజిల్ గా ఇచ్చింది. ‘ఆకలితో ఉన్న పిల్లి పాలు తాగడానికి దారి చూపండి’ అంటూ టీచర్ ఓ ఫజిల్ ను విద్యార్థికి ఇచ్చింది.. దానికి అతను ఇచ్చిన సమాధానాన్ని చూసి కేటీఆర్ ఫిదా అయ్యారు. ఫొటో తీసి ట్విట్టర్ లో పెట్టారు. ఇప్పుడది వైరల్ అయ్యింది.
టీచర్ ఇచ్చిన ఆ ఫజిల్ ను తప్పుగా అర్థం చేసుకున్న విద్యార్థి తనదైన శైలిలో పక్కదారిలో పిల్లి వెళ్లి పాలు తాగుతున్నట్లుగా గుర్తిస్తూ సమాధానం ఇచ్చాడు. దానికి టీచర్ కూడా తప్పు అని చెప్పకుండా రైట్ వేసింది. ఇది వారం రోజుల క్రితం జరిగినట్టుగా తేదిని బట్టి అర్థమవుతోంది. దీనిని పోస్ట్ చేసిన కేటీఆర్ ‘జీవితంలో షార్ట్ కట్ లేదని ఎవరు చెప్పారు.? ఈ కిడ్ చాలా స్మార్ట్ . టీచర్ కూడా అంతే స్మార్ట్ గా కనిపిస్తున్నారు’ అని రాసి కింద వారి హోంవర్క్ ఫొటోలను షేర్ చేశారు. ఇది ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.