Begin typing your search above and press return to search.
నాన్న మాట కేటీఆర్ కు కష్టంగా మారిందట!
By: Tupaki Desk | 3 Oct 2018 1:17 PM ISTప్రపంచం మొత్తాన్ని తమ మాటలతో ప్రభావితం చేయగలరు. కానీ.. తన తండ్రి దగ్గరకు వచ్చేసరికి నోటి వెంట మాట రాని పరిస్థితి. ఇలాంటి తీరు ఎవరదంటారా? ఇంకెవరు..మాటల్లో తండ్రికి తగ్గ తనయుడిగా పేరున్న తెలంగాణ రాష్ట్ర ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కమ్ తాజా మాజీ మంత్రి కేటీఆర్ గా చెప్పాలి. ప్రశ్న ఏదైనా.. పరిస్థితి ఎలాంటిదైనా సరే.. వెనువెంటనే రియాక్ట్ అయ్యే తీరు కేటీఆర్‌ది. జాతీయ.. అంతర్జాతీయ వేదికల మీద తన గళాన్ని బలంగా వినిపించటమే కాదు.. అందరి అభినందనలు అందుకున్న కేటీఆర్.. తన తండ్రి దగ్గరకు వచ్చేసరికి మాత్రం మౌనంగా ఉంటారని చెబుతారట.
కేసీఆర్ మాటకు ఎదురు చెప్పలేని ఆయన.. కొన్ని సందర్భాల్లో తన మాటను ఆయన సన్నిహితుల ద్వారా చెప్పిస్తారని చెబుతారు. బయట నుంచి చూసే వారు ఎవరైనా..ఈ మాటల్ని నమ్మరు. కానీ.. నిజం ఇదేనని చెబుతారు. మరో షాకింగ్ నిజం ఏమంటే.. ముందస్తు ఎన్నికల్లో పార్టీ తరఫున బరిలోకి దిగే అభ్యర్థులకు సంబంధించి కేటీఆర్ కొంత వర్క్ వుట్ చేసి.. ఒక లిస్ట్ తన దగ్గర ఉంచుకున్నట్లుగా చెబుతారు.
సమయం చూసుకొని తండ్రితో తన టీంకు తగ్గట్లుగా టికెట్లు ఇప్పించాలన్న ఆలోచన చేసినట్లు చెబుతారు. కానీ.. ఎవరూ ఊహించని రీతిలో (చివరకు కేటీఆర్ కు సైతం తెలీదు) ఏకంగా 105 సీట్లకు అభ్యర్థులను ప్రకటించటం ద్వారా దిమ్మ తిరిగేలా చేశారు. 105 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ తీరుకు మిగిలిన వారి కంటే ఎక్కువగా కేటీఆర్ ఆశ్చర్యపోయినట్లుగా చెబుతారు. అభ్యర్థుల ప్రకటన అనంతరం ఏర్పడిన అసమ్మతి నేపథ్యంలో బీ ఫారం ఇచ్చే సమయానికి కనీసం పది నుంచి ఇరవై వరకూ అభ్యర్థుల విషయంలో మార్పు ఉంటుందన్న మాట వినిపించింది.
తన సన్నిహితుల దగ్గర కేటీఆర్ ఆ భరోసాను వ్యక్తం చేసినట్లు చెబుతారు. ఎంత లేదన్నా.. పది సీట్ల విషయంలో అభ్యర్థుల మార్పు ఉంటుందన్న విషయాన్ని ఆయన లోగుట్టుగా చెప్పినట్లు సమాచారం.
అయితే.. తాను ఎవరినైతే డిసైడ్ చేశానో.. వారికి తప్పించి వేరే వారికి టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని.. ఒక్కరిని మార్చినా ఒప్పుకోనని కేసీఆర్ తేల్చి చెప్పటంతో కేటీఆర్ కే ఏమీ పాలుపోలేదు. వాస్తవానికి ఉప్పల్ టికెట్ నుతనకు అత్యంత సన్నిహితుడైన మేయర్ బొంతు రామ్మోహన్ కు ఇవ్వాలని కేటీఆర్ భావించారన్నది బహిరంగ రహస్యమే. కేటీఆర్ డైరెక్షన్ లో తనదైన రీతిలో అసమ్మతిని ప్రదర్శించిన ఆయన.. కేటీఆర్ సూచనతో తన నిరసనను విరమించుకున్నట్లు చెబుతారు. తన తండ్రి మొండిగా ఉన్నారని.. ఎట్టి పరిస్థితుల్లో మార్పునకు ఒప్పుకోవటం లేదన్న విషయాన్ని అర్థం చేసుకున్న కేటీఆర్.. వెంటనే బొంతు చేత ఆందోళనల్ని.. అసమ్మతి వాయిస్ అస్సలు వద్దని చెప్పినట్లుగా చెబుతారు. ఇక.. రాజయ్య సీటు విషయంలోనూ కేసీఆర్ పట్టుదలతో ఉన్నట్లు చెబుతారు.
ఎమ్మెల్సీగా ఉన్న కడియం.. రాజయ్య సీటు మీద కన్నేయటం.. కేటీఆర్ ద్వారా పావులు కదిపిన వైనాన్ని మర్చిపోలేదు ఈ విషయం కేసీఆర్ దగ్గర చిన్నపాటి పంచాయితీనే జరిగినట్లుగా చెబుతారు. కడియం ప్రభావం నుంచి బయటకు రావాలన్న మాటను కాస్తంత కరకుగా కేటీఆర్ తో కేసీఆర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. కడియం కోరుకున్నట్లుగా టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పటమే కాదు.. ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి రాజయ్యను తప్పించటం ద్వారా అతనికి అంతో ఇంతో నష్టం చేశానన్న భావనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతారు.
ఇదిలా ఉంటే.. తన తండ్రిని ఏదోలా ఒప్పించి కొన్ని సీట్లలో మార్పులు చేద్దామని భావించినా.. అందుకు వాతావరణం సానుకూలంగా లేకపోవటంపై కేటీఆర్ అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. తన తండ్రి మొండితనాన్ని తాను మార్చలేనని సన్నిహితుల దగ్గర చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి కొడుక్కి పట్టాభిషేకానికి రంగం సిద్ధం చేస్తూనే.. మరోవైపు తన పట్టును ప్రదర్శిస్తున్న కేసీఆర్ తీరు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారినట్లుగా చెబుతున్నారు.