Begin typing your search above and press return to search.

ఇంటి నుంచి ఆసుపత్రిలో చేరిన కేటీఆర్..!

By:  Tupaki Desk   |   1 May 2021 8:39 AM IST
ఇంటి నుంచి ఆసుపత్రిలో చేరిన కేటీఆర్..!
X
తెలంగాణ రాష్ట్ర మంత్రి.. ఇటీవల కరోనా పాజిటివ్ గా తేలిన కేటీఆర్ తాజాగా ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. తన తండ్రి కమ్ సీఎం కేసీఆర్ కు పాజిటివ్ కావటం.. ఛెస్ట్ స్కాన్ కోసం యశోదా ఆసుపత్రికి రావటం.. ఆసందర్భంగా ఆయనతో కలిసి కేటీఆర్ ఉండటం తెలిసిందే. ఈ తర్వాత ఆయన పాజిటివ్ గా తేలటం టీఆర్ఎస్ వర్గాలకు షాకింగ్ గా మారింది. రోజుల వ్యవధిలోనే కేసీఆర్ ఫ్యామిలీలో ఒకరి తర్వాత ఒకరికి పాజిటివ్ గా తేలటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. రాజ్యసభ సభ్యుడు సంతోష్ పాజిటివ్ కావటం.. ఇంట్లోనే చికిత్స పొందిన ఆయన రెండు రోజుల క్రితమే యశోదా ఆసుపత్రిలో జాయిన్ కావటం తెలిసిందే. తాజాగా ఆయన మాదిరే మంత్రి కేటీఆర్ సైతం యశోదాలో చేరారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం శుక్రవారం సాయంత్రం ఆయన ప్రగతి భవన్ నుంచి యశోదాకు షిఫ్ట్ అయ్యారు.

తొలుత అనుకున్నట్లుగా ఇన్ఫెక్షన్ లోడ్ తక్కువగా ఉన్న అంచనాలకు భిన్నంగా ఉండటం.. పాజిటివ్ అని తేలిన తర్వాత చేసిన వైద్యానికి తగ్గట్లు ఫలితం రాకపోవటంతో యశోదాకు షిఫ్ట్ కావటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు చెబుతున్నారు. తమ ఫ్యామిలీ డాక్టర్ సలహాతో ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారంటున్నారు. యువకుడైన కేటీఆర్.. ఇంటి నుంచి ఆసుపత్రికి షిఫ్ట్ అయిన వైనం ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది.