Begin typing your search above and press return to search.

వీళ్లను గుర్తుపట్టారా? ఇప్పుడూ.. ఎప్పుడూ.. టీఆర్ ​ఎస్ ​కు జోడెద్దులు..!

By:  Tupaki Desk   |   27 Dec 2020 9:00 AM GMT
వీళ్లను గుర్తుపట్టారా? ఇప్పుడూ.. ఎప్పుడూ.. టీఆర్ ​ఎస్ ​కు జోడెద్దులు..!
X
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత కీలకపాత్రలు పోషిస్తున్న యువ నేతలు ఎవరంటే రాష్ట్రమంత్రులు కేటీఆర్​, హరీశ్​రావు. వీళ్లిద్దరూ సీఎం కేసీఆర్​కు రక్త సంబంధికులే.. ఒకరు కుమారుడైతే.. మరొకనేత మేనల్లుడు. అయితే ఈ యువనేతలకు సంబంధించిన ఓ ఫొటో వైరల్​గా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ యువ నేతలకు చెందిన ఓ పాత ఫొటో ఇప్పుడు మధుర జ్ఞాపకంగా మారింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి హరీశ్​రావు .. కేసీఆర్​ వెన్నంటే ఉన్నారు. పార్టీ ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా హరీశ్​రావే కాపాడుతూ ఉంటారు. అందుకే ఆయనను టీఆర్​ఎస్​ పార్టీకి ట్రబుల్​ షూటర్​గా పిలుస్తుంటారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికల్లో మినహా.. హరీశ్​ ఇంచార్జిగా బాధ్యతలు తీసుకున్నారంటే.. ఆ నియోజకవర్గంలో పార్టీ తిరుగులేని విజయం సాధించడం ఖాయం.

ఉద్యమ సమయంలోనూ.. తెలంగాణ తొలిసారిగా అధికారంలో వచ్చాక కూడా హరీశ్​రావు పార్టీలో కీలకపాత్ర పోషించారు.
అయితే 2019 ఎన్నికల అనంతరం హరీశ్​రావుకు టీఆర్​ఎస్​ పార్టీలో క్రమంగా ప్రాధాన్యం తగ్గుతూ వచ్చిందని వార్తలు వినిపించాయి. అందుకు కారణం కేసీఆర్​ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏర్పడిన క్యాబినెట్​లో హరీశ్​రావుకు చోటు దక్కలేదు. దీంతో విమర్శలు వచ్చాయి. అయితే తొలి మంత్రివర్గ విస్తరణలో హరీశ్​కు ఆర్థికశాఖ దక్కింది. ఆ తర్వాత ఆయన మళ్లీ పార్టీలో కీ రోల్​ పోషిస్తున్నారు. ఇక అమెరికాలో చదువుకొని.. అక్కడే స్థిరపడ్డ కేటీఆర్​ తెలంగాణ ఉద్యమంలోకి కొంత ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా తన దైన శైలిలో దూసుకుపోయారు. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని కీలకనేతగా ఎదిగారు. అయితే ఆయన ఉద్యమనేతకంటే ఐటీ మంత్రిగానే మంచి పేరు తెచ్చుకున్నారు.

హైదరాబాద్​కు వివిధ కంపెనీలు తీసుకురావడంతో ఆయనకు మంచి పేరు వచ్చింది. అయితే త్వరలోనే ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు కేటీఆర్​ ఒత్తిడివల్లే సీఎం కేసీఆర్​ హరీశ్​రావును పక్కనపెడుతున్నారని.. హరీశ్​రావుకు రాష్ట్రంలో మాస్​ లీడర్​గా ఎంతో చరిష్మా ఉన్నప్పటికీ.. ఆయనకు పార్టీలో తగిన గుర్తింపు రావడం లేదన్నా వాదన ఉంది. అయితే ఇందుకు మంత్రి కేటీఆర్​ కారణమని పొలిటికల్​ సర్కిళ్లలో టాక్​. ఏది ఏమైనప్పటికీ.. ఈ ఇద్దరు నేతలు ఒక్క టీఆర్​ఎస్​ పార్టీలోనే కాక.. మొత్తం తెలంగాణ రాజకీయాల్లోనే కీలకనేతలుగా ఎదిగారు. ఇప్పుడు వీరి చిన్ననాటి ఫొటోలు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి.