Begin typing your search above and press return to search.

ఎదురెళ్లిన నేతకు షాకిచ్చిన కేటీఆర్?

By:  Tupaki Desk   |   13 Jan 2020 11:11 AM IST
ఎదురెళ్లిన నేతకు షాకిచ్చిన కేటీఆర్?
X
రాజకీయాల్లో ఓర్పు, సహనం ఎంత ఎక్కువుంటే అంత మంచిందంటారు. అప్పుడెప్పుడో 1980వ దశకంలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 వరకూ వెయిట్ చేశాడు. కష్టపడ్డాడు సీఎం అయ్యాడు. కానీ ఒకేసారి మేయర్ పదవి కొట్టగానే తర్వాత ఎమ్మెల్యే, మంత్రి పై ఆశలు పెట్టుకుంటే ఏమవుతుందో మన హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను చూస్తే అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మొన్నటి వరకు మహా నగర ప్రథమ పౌరుడి గా ఉన్న మేయర్ గా చక్రం తిప్పిన బొంతు రామ్మోహన్ రాజకీయ భవిష్యత్తు గందర గోళంలో పడింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ తనకు ఉప్పల్ అసెంబ్లీ ఎమ్మెల్యే టికెట్ కావాలని బొంతు తిరుగు బాటు చేశారు. అలిగారు. దూరంగా జరిగారు. కేటీఆర్ నేతలు బుజ్జగించడంతో తిరిగి వచ్చారు.

కానీ కట్ చేస్తే ఇప్పుడు బొంతు వైఖరి నచ్చని ప్రభుత్వ పెద్దలు హైదరాబాద్ జీహెచ్ఎంసీ రిజర్వేషన్ ను జనరల్ మహిళకు రిజర్వ్ చేశారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.. దీంతో మేయర్ గా మరోమారు రామ్మోహన్ కు అవకాశం లేకుండా పోయింది. కేటీఆర్ కు విశ్వాసపాత్రుడు తిరుగుబాటు చేయడంతో ఇలాంటి దుస్థితి ఏర్పడిందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే టికెట్ దక్కక పోతేనే అలిగిన బొంతు ఇప్పుడు మేయర్ పీఠం కూడా రాకపోవడంతో ఆయన అడుగులు ఎటువైపు పడుతాయనేది ఆసక్తిగా మారింది.