Begin typing your search above and press return to search.
మోడీ అండ్ కోకు కేటీఆర్ భారీ వార్నింగ్
By: Tupaki Desk | 29 Oct 2020 4:20 PM ISTఇవాల్టి రోజున ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా.. క్షణాల్లో వైరల్ కావటం.. దానిపై స్పందనలు షురూ కావటం మామూలే. మీడియా.. సోషల్ మీడియా అంతకంతకూ విస్తరించుకుపోవటం.. ప్రతి ఒక్కరు ప్రతి విషయం మీద స్పందించేందుకు అవకాశాలు పెరిగిపోవటంతో.. కొన్ని విషయాలు చాలా త్వరగా అందరి నోళ్లలో నానుతున్నాయి. ఇలాంటివేళ.. మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం.. దేశ ప్రధాని మోడీపై ఆయన చేసిన షాకింగ్ వ్యాఖ్యలు రోజు గడిచే వరకు బయటకు రాకపోవటం ఆసక్తికరం.
ఎందుకిలా జరిగింది? కేటీఆర్ మాటలకు ఇవాల్టి పత్రికల్లో ప్రాధాన్యత లభించినప్పటికీ.. నిన్నటిరోజున టీవీ చానళ్లలోనూ.. యూ ట్యూబ్ చానళ్లు.. ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాం మీదా ఎందుకు కనిపించలేదన్నది అందరికి వచ్చే డౌట్. దీనికి కారణం.. మీడియాతో కాకుండా...కొంతమంది ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో కేటీఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడటమే. కొన్ని మీడియా సంస్థలు.. దీన్ని పిచ్చాపాటిగా అని రాసేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో ప్రింట్ మీడియాకు ఎక్కువప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ కారణంతోనే రోజు తర్వాత కేటీఆర్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
మరి.. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంలో మంత్రి కేటీఆర్ ఏమేం వ్యాఖ్యలు చేశారన్నది చూస్తే..
- మా ఓపిక నశిస్తే.. ప్రధానమంత్రినీ వదిలిబెట్టం.
- సీఎం కేసీఆర్ ను పట్టుకొని హద్దు.. పద్దు లేకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు.
- అన్ని వింటున్నాం. రికార్డు చేస్తున్నాం. మేం సంయమనం పాటిస్తున్నామని చెప్పి.. అది మా అసమర్థతగా అనుకోవద్దు
- సమయం చూసుకొని అందరిని కడిగేస్తాం. ప్రధానిని కూడా వదిలిపెట్టం.
- మాకు నోరుంది. మేం కూడా మాట్లాడగలుగుతాం. మేం మాట్లాడటం మొదలు పెడితే బీజేపీ వాళ్లు తట్టుకోలేరు.
- బీజేపీ నేతలు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది.ప్రతి దానికి టైం వస్తుంది. వారి కంటే ధీటుగా.. ఘాటుగా సమాధానం చెప్పటం ఎలా? ఎప్పుడు..? ఎక్కడ? అన్నది మాకు తెలుసు.
- మా ఓపికకు పరీక్ష పెట్టొద్దు. తప్పుడుప్రచారం చేయటంలో బీజేపీ వాళ్లు గోబెల్స్ ను మించిపోయారు
- ఎప్పటికప్పుడు డైలాగులు కొట్టి బతికేస్తానంటే కుదరదు. ఎక్కడో ఒక దగ్గర ఆ పార్టీ నేతలు ప్రజల నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
- ప్రధానమంత్రి మోడీని సభలో ప్రతిపక్షాలు మాటలు అంటుంటే.. సీఎం కేసీఆర్ నిలువరించారని.. అలాంటి సంస్కారం ఆయనదని.. బీజేపీ వాళ్లకు అది లేదు.
- కేసీఆర్ పై బీజేపీ నేతలకు కోపం.. ద్వేషం ఉండవచ్చు. కానీ.. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. వ్యవస్థనైనా గౌరవించాలి కదా?
- కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని అభినందిస్తున్నా. ఆయన హుందాగా మాట్లాడుతున్నారు. ఆయన మర్యాదపూర్వక ప్రవర్తనకు స్వాగతిస్తున్నా. కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా.. మీ పార్టీ నాయకుల్ని హద్దుల్లో.. అదుపులో పెట్టుకోండి.