Begin typing your search above and press return to search.

కేటీఆర్ కు కోపమొచ్చింది.. కార్పొరేటర్లకు క్లాస్ పీకారట

By:  Tupaki Desk   |   15 Oct 2020 1:45 PM IST
కేటీఆర్ కు కోపమొచ్చింది.. కార్పొరేటర్లకు క్లాస్ పీకారట
X
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు కోపం వచ్చింది. మంగళవారం కురిసిన వర్షాలు..రాత్రి వేళలో విరుచుకుపడిన భారీవర్షం కారణంగా పెరిగిన వరదతో హైదరాబాద్ నగరం అతలాతకులం కావటం తెలిసిందే. పలు ప్రాంతాలు జలమయం కావటమే కాదు.. వరదనీటితో తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు నగర ప్రజలు. తీవ్రత తెలుసుకున్న మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయమే జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకొని అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించారు.

ముఖ్యంగా.. చాంద్రాయణగుట్ట.. తదిరత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా తన వెంట వచ్చిన కార్పొరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తటంతో అసహనానికి గురైన ఆయన.. మీ ఫాలోఅప్ ఏమీ బాగోలేదని.. సీరియస్ నెస్ పట్టదా? ప్రజల కష్టాల్ని అధికారుల వరకు తీసుకెళ్లటంతో ఫెయిల్ అయినట్లుగా క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది.

వర్షం వేళ.. తాము కష్టపడినా.. తమకు తిట్టే మిగిలినట్లుగా కార్పొరేటర్లు వాపోతున్నారు. త్వరలో జరిగేగ్రేటర్ ఎన్నికల్ని తాజా వర్షాలు ప్రభావితం చేస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భారీ వర్షం.. వరద పోటెత్తటంతో చోటు చేసుకున్న నష్టం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందని చెప్పక తప్పదు.