Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను మించి.. కేటీఆర్ ప్రతాపం చూపించాడు

By:  Tupaki Desk   |   3 Feb 2020 5:36 AM GMT
కేసీఆర్ ను మించి.. కేటీఆర్ ప్రతాపం చూపించాడు
X
మున్సిపల్ ఎన్నికల వేళ అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో అర్థం కావడం లేదని కేటీఆర్ అన్నారు. తన సారథ్యంలో ఎదుర్కొన్న మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ ఇచ్చిన ప్రజలకు ఖచ్చితంగా ఉరకలెత్తించే పాలన ఇస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే తాజాగా ఐఏఎస్ ల ప్రక్షాళన చేసి తెలంగాణ అధికార వర్గాలనే షేక్ చేశారు.

తెలంగాణ ఏర్పడ్డ 6 ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున ఐఏఎస్ ల బదిలీలు ఎప్పుడూ జరగలేదట.. తెలంగాణ లోనే ఇదో భారీ కుదుపుగా చెప్పవచ్చు. ఏకంగా 50మంది ఐఏఎస్ లను బదిలీ చేయడం అధికార వర్గాల్లో కలకలం రేపింది. ఇందులో విశేషం ఏంటంటే బదిలీల్లో కేసీఆర్ ముద్రం ఏం లేదు. మొత్తం అన్నీ తానై కేటీఆర్ నడిపించారు. కేటీఆర్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని అధికార వర్గాలంటున్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, కీలక శాఖాధిపతులు మారినా.. కేటీఆర్, కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు మాత్రం బదిలీ కాలేదు. ఇక కేటీఆర్ చూస్తున్న ఐటీశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ కూడా మారకపోవడం విశేషం. దీన్ని బట్టి కేటీఆర్ తనకు అత్యంత సన్నిహితులైన అధికారులను మార్చలేదు, కదల్చలేదు.

ఇక మరో విశేషం ఏంటంటే.. ఏఏ సీనియర్ అధికారులు తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో అద్భుతంగా పనిచేశారో ఆ శాఖలకే బదిలీ చేయడం గమనార్హం. వారి బలాన్ని అందుకోసమే వినియోగించేలా కేటీఆర్ వ్యూహరచన చేశారు. స్ట్రిక్ట్ ఆఫీసర్లను కీలక పోస్టింగుల్లోకి మార్చారు. తన సారథ్యంలో వెళ్లిన ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన ప్రజలకు మెరుగైన పాలన అందిస్తానన్న కేటీఆర్ అన్నట్టే మాట నిలబెట్టుకున్నారు. ఇక ఈ నాలుగేళ్లు పాలనను పరుగులు పెట్టించడమే.. కేసీఆర్ మార్క్ కంటే ఈ బదిలీల్లో కేటీఆర్ మార్క్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని అధికార వర్గాలంటున్నాయి.