Begin typing your search above and press return to search.
నాన్నకు చెప్పే మోడీని తిడుతున్నారా కేటీఆర్?
By: Tupaki Desk | 26 Feb 2019 10:51 AM ISTఆకాశానికి ఎత్తేయటం.. అంతలోనే నేల మీదకు దించటం.. అవసరమైతే పాతాళానికి తొక్కేసేలా మాట్లాడటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిట్ట. ఎన్నికల వేళలో నిప్పులు చెరిగేలా మాట్లాడటం.. ఫలితానికి తగ్గట్లుగా రియాక్ట్ కావటం అలవాటే. ఈ మధ్యన ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోడీ వర్సెస్ కేసీఆర్ మధ్య విమర్శలు చోటు చేసుకున్నాయి.
కానీ.. తెలంగాణలో తమ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత కేసీఆర్ మాటలో మార్పు వచ్చింది. అంతేనా.. మొదట్లో ఏళ్లకు ఏళ్లు కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇవ్వని ప్రధాని మోడీ సైతం.. వెంటనే ఆయనకు టైం ఇవ్వటం.. ఇరువురు అధినేతలు ఏకాంతంగా నలభైఐదు నిమిషాల వరకు మాట్లాడుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను అనుసరించిన వ్యూహాన్ని మోడీ మాష్టారికి కేసీఆర్ చెప్పినట్లుగా చెబుతారు. తర్వాతి కాలంలో మోడీపైనా.. ఆయన పార్టీపైనా చిందులు వేస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేయని కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెబుతారు.
ఓవైపు బీజేపీ.. కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా తాము ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పే కేసీఆర్.. మోడీకి వ్యతిరేకంగా విపక్షాలు కలిసి ఏర్పాటు చేసిన సభకు వెళ్లకపోవటమే కాదు.. మమత లాంటి నేత మోడీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన దీక్ష చేపడితే.. వెళ్లి పలుకరించింది లేదు. ఓవైపు మోడీకి వ్యతిరేకమని చెబుతూనే.. మరోవైపు మోడీ వ్యతిరేకించే నేతల్ని కలవకపోవటం ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే.. తాజాగా మోడీ తీరును తీవ్రంగా తప్పు పడుతూ టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ బిల్డప్ ఎక్కువ.. చేసేది తక్కువంటూ ఎద్దేవా చేశారు. మోడీ ప్రతిష్ట రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన పరపతి తగ్గుముఖం పడుతున్నట్లు తిట్లదండకం అందుకున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్.. బీజేపీలు కలిసినా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవన్న కేటీఆర్.. ఆ రెండు పార్టీలకు కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేన్ని సీట్లు రావన్న వాదనను వినిపించారు.
దేశంలో బీజేపీ.. కాంగ్రెస్ లు తప్పించి వేరే పార్టీలు లేవా అంటూ ప్రశ్నించిన కేటీఆర్.. వచ్చే ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలదే హవా అని స్పష్టం చేశారు. మరి.. ప్రాంతీయ పార్టీలదే హవా అయినప్పుడు ఇటీవల కాలంలో మోడీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలు నిర్వహించిన సభకు కేసీఆర్ ఎందుకు వెళ్లనట్లు? అది కూడా పక్కన పెడదాం.. మోడీని ఈ స్థాయిలో తిట్టే ప్రోగ్రామ్ నాన్నకు చెప్పే చేశారా కేటీఆర్ జీ?