Begin typing your search above and press return to search.
కోదండరాం కొట్లాట..జానారెడ్డి కోసమా..జైపాల్ రెడ్డి కోసమా?
By: Tupaki Desk | 4 Dec 2017 11:05 PM ISTనిరుద్యోగ యువతకు మేలుచేసేలా...కొలువుల భర్తీ చేపట్టాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చేపట్టిన కొలువుల కొట్లాటను అధికార టీఆర్ ఎస్ పార్టీ సీరియస్ గానే తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సభ కోసం సన్నాహాలు జరుగుతున్న సమయంలో పార్టీకి చెందిన పలువురు నేతలు స్పందించగా....కోదండారం సభ రోజు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్నప్పటికీ...కోదండరాంపై ఆయన విరుచుకుపడ్డారు. కొలువుల కొట్లాట ఎవరి కోసమని కేటీఆర్ ప్రశ్నించారు.
మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న కేటీఆర్.. అక్కడి మున్సిపాలిటీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.ఈ సందర్భంగా ఇటు కాంగ్రెస్ అటు కోదండరాంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కొంతమంది నాయకులు ఓ రిటైర్డ్ ప్రొఫెసర్‌ను పట్టుకొని శిఖండి రాజకీయాలు చేస్తున్నారని ఐటీ మినిస్టర్ కేటీఆర్ మండిపడ్డారు. కొలువుల కొట్లాట ఎవరి కోసమని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ డ్రామాలాడుతున్నదని ధ్వజమెత్తారు కొలువుల కొట్లాట మీ పదవుల కోసమా? అని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. జైపాల్ రెడ్డి కొలువు కోసమా.. జానారెడ్డి కొలువు కోసమా? అని ప్రశ్నించారు. ఈ రోజు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న నాయకులు.. ఉద్యమ సమయంలో ఏనాడైనా కలిసి వచ్చారా? అని అడిగారు.
మొసలి కన్నీరు కారుస్తున్న ముసలి నక్క కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణను నిండా ముంచింది కాంగ్రెస్సే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బాసులు ఢిల్లీలో లేరు.. తెలంగాణ గల్లీలో ఉన్నారని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పినవన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయని మంత్రి తెలిపారు.50 ఏళ్లు అధికారమిస్తే కాంగ్రెస్ నేతలు చేసిందేమీ లేదని కానీ ఇప్పుడు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తమకు 60 నెలల అధికారం ఇచ్చారని..ఆనాటి వరకు లక్ష కాదు లక్షా పన్నెండు వేల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఫార్మాసిటీతో పాలమూరు - రంగారెడ్డి యువతకు లక్ష ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్ తెలిపారు.అయినప్పటికీ...ప్రతీ అంశంపై కోర్టుకు వెళ్లి అడ్డుపడుతున్నారని తెలిపారు. ఫార్మాసిటీ భూసేకరణకు కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని నిప్పులు చెరిగారు.
పాలమూరులో విపక్ష నేతలు శిఖండి రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. పాలమూరు ప్రజలకు నీళ్లు ఇవ్వాలన్న సోయిలేని వాళ్లు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. `పాలమూరు జిల్లా పచ్చబడుతున్నది. వచ్చే ఎండాకాలం నాటికి మహబూబ్ నగర్ లో ఇంటింటికి ప్రతీ రోజు నీరిస్తాం. గతంలో పాలమూరు దేశంలోనే వెనుకబడిన జిల్లా. కానీ ఇప్పుడు పాలమూరు జిల్లా దశ మారింది. వలస పోయినోళ్లు జిల్లాకు తిరిగి వస్తున్నారు` అని తెలిపారు.