Begin typing your search above and press return to search.

చేవెళ్ల ఎంపీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్ ..ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   10 Dec 2019 5:33 AM GMT
చేవెళ్ల ఎంపీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్ ..ఎందుకంటే ?
X
చేవెళ్ల టిఆర్ఎస్ ఎంపి రంజిత్ రెడ్డి వ్యవహార శైలితో టి ఆర్ ఎస్ పార్టీ కి నేషనల్ లెవెల్ లో డ్యామేజ్ కలిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకు అంటే ..ఏ పార్టీ నేత అయిన కూడా తమ అధినేత గురించి ఎవరైనా అడిగిన సమయం లో ఉన్నదానికంటే ఇంకా రెండు కలిపి చాలా గొప్పగా అది చేసారు , ఇది చేసారు అని చెప్తారు. కానీ , చేవెళ్ల టిఆర్ఎస్ ఎంపి రంజిత్ రెడ్డి మాత్రం ఒక నేషనల్ ఛానెల్ డిబేట్ లో పాల్గొని ..సీఎం కేసీఆర్ గురించి అడిగిన ఒక ప్రశ్న కి ..దీటుగా సమాధానం చెప్పలేక పోవడంతో సీఎం కేసీఆర్ కి నేషనల్ లెవెల్ లో కొంత ఇమేజ్ డ్యామేజ్ అయింది అని చెప్పాలి. ఇంతకీ ఏ విషయం లో ఎంపీ ..సీఎం కేసీఆర్ గురించి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయారు? అంటే ..

తాజాగా ఎంపీ రంజిత్ రెడ్డి .. ఒక నేషనల్ ఛానెల్ డిబేట్ లో పాల్గొన్నారు. ఆ డిబేట్ లో భాగంగా యాంకర్ ఎంపీకి ఒక ప్రశ్న వేసింది ...దేశం మొత్తం సంచలనం సృష్టించిన దిశ ఉదంతం గురించి అందరికి తెలిసిందే. ఈ ఘటన జరిగిన తరువాత ఆమె తల్లిదండ్రులని పరామర్శించడం కానీ ,కనీసం ఫోనో లో అయిన దైర్యం చెప్పడం కానీ మీ నాయకుడు . సీఎం కేసీఆర్ ఎందుకు చేయలేకపోయారు అని అడగ్గా .. ఎంపీ కనీసం దానికి సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేయకుండా సైలెంట్ గా ఉన్నారు. ఈ ఒక ఇంటర్వ్యూ పార్టీకి మరియు జాతీయ స్థాయిలో సిఎంకు చాలా నష్టం కలిగించింది.

దీనిపై టి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఎంపీ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అలాగే టిఆర్ఎస్ పార్టీ తన ప్రతి నిధులను టివి ఛానల్ చర్చలలో కనిపించకుండా నిరోధించింది. అయినప్పటికీ టీవీ డిబేట్ లో పాల్గొనడానికి ఎలా , ఎందుకు అంగీకరించారు అని ఎంపీ ని ప్రశ్నించినట్టు సమాచారం. దీనిపై నెటిజన్స్ కూడా ట్రోల్స్ చేస్తున్నారు. టీవీ డిబేట్ లో మాట్లాడేంత సమర్థత లేనప్పుడు ..టీవీ డిబేట్స్ లోకి ఎందుకు వెళ్ళాలి అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.