Begin typing your search above and press return to search.

4 బిల్డింగ్‌ ల‌తో బాబు బిల్డ‌ప్‌..4 కోట్ల మందితో కేసీఆర్ ధైర్యం

By:  Tupaki Desk   |   1 Dec 2018 10:48 PM IST
4 బిల్డింగ్‌ ల‌తో బాబు బిల్డ‌ప్‌..4 కోట్ల మందితో కేసీఆర్ ధైర్యం
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడుపై టీఆర్ ఎస్ నేత - తెలంగాణ అప‌ద్ధ‌ర్మ మంత్రి కేటీఆర్ ఎదురుదాడి కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే వివిధ ప్రచార స‌భ‌ల్లో బాబుపై దుమ్మెత్తిపోస్తున్న కేటీఆర్ ఓ టీవీ ఛాన‌ల్ చ‌ర్చాగోష్టిలో కూడా చంద్ర‌బాబు తీరును ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్దికి అడ్డుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇకపై తాము కూడా ఆంధ్రా రాజకీయాల్లో వేలుపెడతామని పున‌రుద్ఘాటించిన ఆయ‌న రాజకీయంగా ఇకపై చంద్రబాబు గడ్డుకాలాన్ని ఎదుర్కోవాల్సివస్తుందని తెలిపారు. చంద్రబాబు ఎన్ని గిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజలు టీఆర్ ఎస్ వైపే ఉన్నారని చెప్పారు. కూట‌మి కుట్ర‌లు చెల్ల‌వ‌ని స్ప‌ష్టం చేశారు.

హైద‌రాబాద్‌ ను తానే నిర్మించాన‌ని చంద్ర‌బాబు ప్ర‌చారం చేసుకోవ‌డంపై కేటీఆర్ ఎద్దేవా చేశారు. నాలుగు బిల్డింగ్‌ లు కట్టిన చంద్రబాబే హైద‌రాబాద్‌ ను - సైబ‌రాబాద్‌ ను తానే క‌ట్టాన‌ని ఫోజు కొడితే రాదనుకున్న తెలంగాణను సాకారం చేసిన కేసీఆర్ కు ఎంతుండాలని అన్నారు. “చంద్రబాబు నేనేం తప్పు చేశానని ప్రశ్నిస్తున్నారు… నిజంగా నువ్వు తప్పుచేయలేదా..? నువ్వేమైనా సుద్దపూసవా..? నందమూరి కుటుంబానికి రాజకీయంగా దెబ్బకొట్టడానికి చంద్రబాబు చూస్తున్నారు.. అందుకే సుహాసినికి కుకట్ పల్లి టికెట్ ఇచ్చారు. మీ40 సంవత్సరాల రాజకీయ జీవితంలో సొంత డబ్బా కొట్టుకోవడంతోనే సరిపోయింది” అని కేటీఆర్ అన్నారు సోనియాని తిట్టిన చంద్రబాబును ఆలయ్ బలయ్ చేసుకొని రాహుల్ గాంధీ తిరుగుతున్నారని విమర్శించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నవాళ్ళకు 4 ఏళ్ల‌ పాలనతో బదులిచ్చి.. కేసీఆర్ దుమ్ము దులుపుతున్నారని చెప్పారు.