Begin typing your search above and press return to search.
చంద్రబాబు అంకుల్ పై కేటీఆర్ ఫైర్
By: Tupaki Desk | 27 Jan 2016 2:48 PM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చం ద్రబాబునాయుడుపై తెలంగాణ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చంద్రబాబుపై చురకలు వేశారు. ఆయన అమరావతి సంగతి మాత్రమే చూసుకోవాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఐటీ ఉద్యోగులతో సమావేశం నిర్వహించిన ఆయన అక్కడ తొలిసారి చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఇంటర్నెట్ కూడా చంద్రబాబే కనిపెట్టానంటారేమో అంటూ ఎద్దేవా చేశారు.
''చంద్రబాబు గారూ... మీరు మీ రాజధాని చూసుకుంటే.. మేం హైదరాబాద్ చూసుకుంటాం'' అని కేటీఆర్ అన్నారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి జరగలేదని చెప్పారు. హైదరాబాద్ కంటే బెంగళూరులో ఐటీ అభివృద్ధి జరిగిందన్నారు. చంద్రబాబు తీరు చూస్తుంటే ఇంటర్నెట్ కూడా తానే కనిపెట్టినట్లు చెబుతారని అన్నారు. తన సొంత రాష్ట్రానికే ఏమీ తెచ్చుకోలేకపోయారని, ఇక తెలంగాణకు ఏం చేస్తారని విమర్శించారు. అమరావతికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని అన్నారు.
కాగా కేటీఆర్ మునుపెన్నడూ చంద్రబాబుపై ఈ స్థాయిలో విమర్శలు చేయలేదు. పైగా చంద్రబాబు పట్ల గౌరవంగానే ఉండేవారు. అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ ను ఆహ్వానించడానికి చంద్రబాబు వెళ్లినప్పుడు కేటీఆర్ కూడా అక్కడే ఉన్నారు. ఆ సమయంలో చంద్రబాబు కేటీఆర్ ను 'ఆహ్వానం పంపాను అందిందా' అని వ్యక్తిగతంగా అడిగారు. అందుకు కేటీఆర్ ఎంతో మర్యాదగా 'అందింది అంకుల్' అంటూ అభిమానంగా సమాధానమిచ్చారు. అయితే.. ఇప్పుడు ఎన్నికల వేడిలో చంద్రబాబు అంకుల్ పై కేటీఆర్ సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తుండడంతోనే.. కేటీఆర్ కూడా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది.