Begin typing your search above and press return to search.
ముంబయి రోడ్ల మీద పరుగులు తీసిన కేటీఆర్ కల
By: Tupaki Desk | 19 Aug 2022 12:00 PM ISTఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పవర్ ఫుల్ నేత అన్నంతనే సీఎం కేసీఆర్ గా చెబుతారు. ఆయన మాదిరి ముఖ్యమంత్రి కాకున్నా.. ఆయన స్థాయికి ఏ మాత్రం తగ్గని అధికారదర్పాన్ని ఎంజాయ్ చేస్తున్న వారిలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ముందుంటారు.
ఆయన అనుకోవాలే కానీ.. ఏదైనా ఇట్టే జరిగిపోతుందని భావిస్తారు. కానీ.. ఆయన నోరు తెరిచి అడిగిన తర్వాత కూడా జరగని పనులు చాలానే ఉంటాయన్న విషయం తాజాగా ముంబయిలో మొదలైన డబుల్ డెక్కర్ బస్సు సర్వీసు స్పష్టం చేస్తుందని చెప్పాలి.
కొన్ని నెలల క్రితం ఒక ఉదయాన మంత్రి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. అందులో తమ చిన్నతనంలో హైదరాబాద్ మహానగరంలో డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవని.. నాటి సంగతుల్నిగుర్తు చేసుకున్నారు. భాగ్యనగరిలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు తీస్తే బాగుండన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ నోటి నుంచి వచ్చిన కలకు వెంటనే రియాక్షన్లు మొదలయ్యాయి. కానీ.. మొత్తంగా మాత్రం పూర్తి కాలేదు. అందుకు బోలెడన్ని కారణాలుగా చెప్పుకొచ్చారు.
అయితే.. మనకు ఇన్ని కారణాలు కనిపిస్తే.. మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో తాజాగా డబుల్ డెక్కర్ బస్సు సర్వీసు షురూ అయ్యింది. పూర్తి ఏసీతో కూడుకున్న డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ తొలిసారిగా ఈ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
రానున్న కొద్ది కాలంలో మొత్తం 900 ఎలక్ట్రిక్ బస్సుల్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది మార్చి లోపు 450 బస్సుల్ని రోడ్ల మీదకు తీసుకు రావాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా డబుల్ డెక్కర్ బస్సును రోడ్ల మీదకు తీసుకొచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ బస్సులో సీట్లను రిజర్వు చేసుకోవటానికి యాప్ సాయంతో చేసుకోవచ్చని చెబుతున్నారు.
అత్యాధునిక సాంకేతికత, అల్ట్రా-మోడ్రన్ డిజైన్, అధిక భద్రత, బెస్ట్ ఇన్ క్లాస్ కంఫర్ట్ ఫీచర్స్‌తో తయారు చేశారు. ఇదంతా చూసినప్పుడు మంత్రి కేటీఆర కలను తెలంగాణ అధికారులు సాకారం చేయకున్నా.. అందుకు భిన్నంగా ముంబయి అధికారులు మాత్రం డబుల్ డెక్కర్ ను తీసుకొచ్చారు. తరచూ ఎవరోఒకరితో పోలిక పెట్టి కేంద్రాన్ని ఏసుకునే ఆయన్ను.. డబుల్ డెక్కర్ విషయంలో ఆయనేం చెబుతారో?