Begin typing your search above and press return to search.
కేటీఆర్ శాలరీతో గ్రీనరీ
By: Tupaki Desk | 16 July 2016 12:52 PM ISTతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరిత హారం మహోద్యమంగా సాగుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి - ప్రోత్సహించడానికి తొలుత తామే ముందుకు రావాలన్న లక్ష్యంతో కేసీఆర్ తనయుడు - తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన తన నెల జీతాన్ని హరిత హారం కోసం విరాళంగా ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు. గ్రీనరీ కోసం తన శాలరీని ఇచ్చిన కేటీఆర్ స్ఫూర్తిగా తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలు - కార్పొరేషన్ల ఛైర్మన్లు - మేయర్లంతా కూడా తమ నెల జీతాలను విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు.
కేటీఆర్ తన పురపాలక శాఖలోనూ ఈ నెల 18న హరితహారంను చేపట్టనున్నారు. ఇందుకోసం చెట్టు-బొట్టుపేరుతో అన్ని కార్పొరేషన్లు - మునిసిపాలిటీల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.10 కోట్లను విడుదల చేయనుంది. అయితే, కార్యక్రమం ఆశించినదానికంటే ఎక్కువగా విజయవంతం అయ్యేందుకు మంత్రి కేటీఆర్ ఈ విరాళాల ఆలోచన చేశారు. చెట్టు-బొట్టు కార్యక్రమానికి విరాళంగా తన ఒక నెల వేతనాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మంత్రితోపాటు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్ - మునిసిపల్ మేయర్లంతా తమ నెల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నారు. మునిసిపల్ శాఖలోని ఉద్యోగులంతా తమ ఒకరోజు వేతనాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అందరి వేతనాలను విరాళంగా ఇవ్వడం వల్ల మొక్కల సంరక్షణపై అందరికీ సమాన బాధ్యత వహిస్తుందన్నది కేటీఆర్ ప్లాన్‌గా కనిపిస్తోంది.
ఇంతకీ కేటీఆర్ ఇచ్చిన ఒకనెల వేతనం ఎంతో తెలుసా? అక్షరాల రూ.2.5 లక్షలు. ఇటీవల తెలంగాణ ఎమ్మెల్యేల వేతనాలు భారీగా పెరిగాయి కదా! ఇందులో మంత్రిగా ఆయన అలవెన్సులు ఇంకాస్త ఎక్కువే! అన్ని కలిపి మొత్తం 2.5 లక్షలు వేతనాన్ని ఆయన విరాళంగా ప్రకటించేశారు. మరోవైపు ఛైర్మన్లు, మేయర్లు, ఇతరులు కూడా విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తుండడంతో భారీగానే నిధులు సమకూరుతాయని అంచనా వేస్తున్నారు. మొత్తానికి కేటీఆర్ చొరవ హరితహారానికి అండగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.