Begin typing your search above and press return to search.
కేటీఆర్ చేతిలో అడ్డంగా బుక్కయిన టీబీజేపీ
By: Tupaki Desk | 28 July 2018 7:44 PM ISTతెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల కీర్తి కండూతి నవ్వుల వారిని నవ్వుల పాలు చేసింది. తమది కాని కార్యాచరణను తమ ఖాతాలో జమ చేసుకునేందుకు ఆ పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రచారం నవ్వులపాలు అయిపోయి....సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సైతం స్పందించడంతో.. బీజేపీ తన కామెడీని ఆపేసింది. తెలంగాణ బీజేపీ నేతలు ప్రచారయావ నెటిజన్లు - మంత్రి కేటీఆర్ చమత్కారంతో నవ్వులపాలయిందని చర్చించుకుంటున్నారు.
మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నరాజన్న సిరిసిల్లా జిల్లాలోని వీర్నపల్లి పాఠశాలలో సీఎస్ ఆర్ నిధులతో సృజనాత్మకతనును జోడించి పాఠశాల తరగతి గదులను రైలుబోగీల వలే తీర్చిదిద్దారు. ఈ చిత్రాలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్లో పొందుపరిచి సంతోషం వ్యక్తం చేశారు. అయితే, దీన్ని తెలంగాణ బీజేపీ నేతలు కాపీకొట్టేశారు. వారి అధికారిక ఖాతా అయిన https://twitter.com/bjp4telangana తెలంగాణలో ఈ చిత్రాలను పోస్ట్ చేసి సిరిసిల్ల జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో దక్షిణ మధ్య రైల్వే నిధులతో ఆధునీకరించిన ప్రభుత్వ పాఠశాల దృశ్యాలు అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. అయితే, దీనిపై పలువురు నెటిజన్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ ను - బీజేపీ క్రెడిట్ కొట్టేసే ఎత్తుగడను సొంతం చేసుకున్న తీరును ట్విట్టర్ - ఫేస్ బుక్ లో ఎద్దేవా చేశారు. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ సైతం మరో ట్విట్టర్ లో పొందుపర్చారు. ‘మీకు భలే హాస్య చతురత ఉంది. ఇవి ప్రైవేటు కంపెనీలకు చెందిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు దక్షిణమధ్య రైల్వే నిధులు కావు.’ అంటూ పంచ్ పేల్చారు.