Begin typing your search above and press return to search.

మోడీని హ‌ర్ట్ చేయ‌టం మంచిదికాదు కేటీఆర్!

By:  Tupaki Desk   |   7 July 2019 3:53 PM IST
మోడీని హ‌ర్ట్ చేయ‌టం మంచిదికాదు కేటీఆర్!
X
ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ఒక పోస్ట్ వైర‌ల్ గా మారుతోంది. సింపుల్ గా క‌నిపించినా.. ఆ మెసేజ్ లోని లోతు చూసినోళ్లంతా ఫిదా అవుతూ స‌ద‌రు పోస్ట్ ను ఫార్వ‌ర్డ్ చేస్తున్నారు. ఇంత‌కీ ఆ మెసేజ్ ఏమంటే.. వాగే వాడితో సీక్రెట్ చెప్ప‌కూడ‌దు.. వాదించే వాడితో ఆర్గ్యుమెంట్ చేయ‌కూడ‌దు.. తెలివైనోడితో పోటీ ప‌డ‌కూడ‌దు.. తెగించినోడితో త‌ల‌ప‌డ‌కూడ‌దన్న‌ది సారాంశం. నిజానికి ఈ విష‌యాలు తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలీవా? అంటే తెలుస‌నే చెబుతారు.

కానీ.. కోపంలోనో.. భావోద్వేగంలోనో.. టైం బాగోన‌ప్పుడు త‌ప్పులు జ‌రిగిపోతుంటాయి. అలాంటిదే తాజాగా జ‌రిగింద‌న్న అభిప్రాయాన్ని కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. ఇద్ద‌రు ప్ర‌త్య‌ర్థులు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకునే స‌మ‌యంలో మూడో మ‌నిషి ప్ర‌స్తావ‌న తేకూడ‌దు. ఒక‌వేళ తెచ్చినా.. బ‌లాబ‌లాన్ని బేరీజు వేసుకొనే మాట్లాడాలే త‌ప్పించి తొంద‌ర‌ప‌డ‌కూడ‌దు.

ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో మోడీకి మించిన మొన‌గాడు.. బ‌ల‌వంతుడు ప్ర‌స్తుతానికైతే మ‌రెవ‌రూ లేరు. ఇలాంట‌ప్పుడు మోడీని ఉద్దేశించి తొంద‌ర‌ప‌డి కామెంట్ చేయ‌టం ఏ మాత్రం మంచిది కాదు. కొన్ని విష‌యాల్ని మోడీ ఎంత సీరియ‌స్ గా తీసుకోవ‌ట‌మే కాదు.. చిన్న విష‌యాల్ని సైతం చాలా ఎక్కువ‌కాలం మ‌న‌సులో ఉంచుకొని అంత‌కంత‌కూ బ‌దులు తీర్చుకుంటార‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది.

అలాంటి ప‌రిస్థితుల్ని ప్రాతిప‌దిక‌గా తీసుకుంటే తాజాగా మోడీని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు తొంద‌ర‌పాటుగా చెప్ప‌క త‌ప్ప‌దు. బీజేపీకి చెందిన నేత శ‌ర్మ‌తో.. కేటీఆర్ ట్విట్ట‌ర్ లో సంవాదానికి దిగారు. ఇందులో భాగంగా శ‌ర్మ కాస్త ముందుకు వెళ్లి వాట‌ర్ గ్రిడ్ ప‌థ‌కాన్ని అధ్య‌య‌నం చేసేందుకు మీరు గుజ‌రాత్ ను సంద‌ర్శించిన విష‌యం వాస్త‌వం కాదా? స‌బ‌ర్మ‌తి న‌దిలోకి నీళ్లు ఎత్తిపోసే న‌ర్మ‌దా కాలువ‌ను మీరు ప్ర‌శంసించ‌లేదా? దాని ఆధారంగానే మీరు కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల ప‌థ‌కాల్ని చేప‌ట్ట‌లేదా? అంటూ ప్ర‌శ్న‌ల్ని సంధించారు. ఇలాంటివేళ కామ్ గా ఉండ‌ట‌మో లేదంటే ఎదురుదాడి చేస్తే ఫ‌ర్లేదు. త‌ప్పేం కాదు.

కానీ.. అందుకు భిన్నంగా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. గుజ‌రాత్ మోడ‌ల్ ను అన్ని రాష్ట్రాలు అధ్య‌య‌నం చేయాల‌ని ప్ర‌ధాని లేఖ‌లో కోరితేనే.. ఆ రాష్ట్రాన్ని తాను సంద‌ర్శించార‌న్న ట్వీట్ లో పంచ్ కంటే కూడా ఈగోనే ఎక్కువ‌గా క‌నిపిస్తుంద‌న్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎక్క‌డో ఒక స‌భ‌లో ఇలాంటి మాట‌లు ఫ‌ర్లేదు కానీ ట్విట్ట‌ర్ వేదిక మీద ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌టం ద్వారా త‌న‌ను చిన్న‌బుచ్చిన‌ట్లుగా మోడీ ఫీల‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తెలివైనోడిగా పేరున్న కేటీఆర్ ఎందుకిలా త‌ప్పు చేస్తున్న‌ట్లు?