Begin typing your search above and press return to search.

కుర్ర కేసీఆర్...బుల్లి కేటీఆర్...ఫొటో వైర‌ల్!

By:  Tupaki Desk   |   13 May 2018 1:00 PM IST
కుర్ర కేసీఆర్...బుల్లి కేటీఆర్...ఫొటో వైర‌ల్!
X
నేడు ప్ర‌పంచవ్యాప్తంగా అంత‌ర్జాతీయ మాతృ దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రుపుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. మాతృత్వానికి గుర్తుగా, మాతృమూర్తి సేవ‌ల‌ను, త్యాగాల‌ను నేడు స్మ‌రించుకోవ‌డం ఆన‌వాయితీ. ప్ర‌తి ఏటా మే నెల‌లోని రెండో ఆదివారం నాడు అంత‌ర్జాతీయ మాతృ దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తుంటారు. నేడు మాతృ దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌లువురు సెల‌బ్రిటీలు, రాజ‌కీయ‌వేత్త‌లు, సినీతార‌లు...త‌మ త‌ల్లుల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ వారి ప‌ట్ల త‌మ ప్రేమ‌ను చాటుకుంటున్నారు. తాజాగా, తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్....కూడా త‌న మాతృమూర్తికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. దానితో పాటు త‌న త‌ల్లిదండ్రుల‌తో బాల్యంలో దిగిన ఫొటోను కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం కేటీఆర్ చేసిన ట్వీట్ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

సోష‌ల్ మీడియాలో కేటీఆర్ యాక్టివ్ గా ఉంటార‌నే సంగ‌తి తెలిసిందే. అయితే, రాజ‌కీయాల్లో కేటీఆర్ ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ దొరికిన కొద్ది స‌మ‌యాన్ని త‌న త‌ల్లిదండ్రులు, పిల్ల‌ల‌తో గ‌డిపేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. తాజాగా మాతృదినోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న త‌న మాతృమూర్తికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. `` నాకు తెలిసిన శ‌క్తి మంత‌మైన మ‌హిళ మా అమ్మ‌. ఈ రోజు నేను ఈ స్థాయికి చేరుకోవ‌డానికి కార‌ణం ఆమె. మాతృ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు అమ్మా! అమ్మ‌తో పాటు వెల‌క‌ట్ట‌లేని ప్రేమ‌ను త‌మ బిడ్డ‌ల‌కు పంచుతోన్న త‌ల్లులంద‌రికీ మాతృదినోత్స‌వ శుభాకాంక్ష‌లు``అని కేటీఆర్ ట్వీట్ చేశారు. దాంతో పాటు త‌న చిన్న‌నాటి ఫొటోను పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో నూనూగు మీసాల‌తో యుక్త వ‌య‌స్సులో ఉన్న కేసీఆర్ కూడా ఉన్నారు. అదే ఫొటోలో బుల్లి కేటీఆర్ ను ఆయ‌న త‌ల్లి శోభా రావు ఎత్తుకొని ఉన్నారు. యంగ్ కేసీఆర్...బుల్లి కేటీఆర్ ఉన్న ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.