Begin typing your search above and press return to search.

టీఆరెస్ కు కొత్త పేరు పెట్టిన కేటీఆర్

By:  Tupaki Desk   |   21 April 2016 3:20 PM IST
టీఆరెస్ కు కొత్త పేరు పెట్టిన కేటీఆర్
X
టీఆరెస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అని అందరికీ తెలుసు. అయితే. ఆ మధ్య గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో తెలంగాణ మంత్రి, టీఆరెస్ నేత కేటీఆర్ టీఆరెస్ అన్న పదానికి కొత్త అర్థం చెప్పారు. టీఆరెస్ అంటే తెలుగు రాష్ట్ర సమితి అని పేరు మారుస్తామని... ఏపీలోని భీమవరం నుంచి పోటీ చేసి గెలుస్తామని సరదాగా చెప్పారు. అదే కేటీఆర్ ఇప్పుడు మళ్లీ టీఆరెస్ కు కొత్త నిర్వచనం చెప్పారు. టీఆరెస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని చెబుతూ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపారు.

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావును ప్రకటించిన కేసీఆర్... ఆ ఎన్నిక ఇన్ చార్జీగా కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మీడియాతో మాట్టాడిన కేటీఆర్ తమ పార్టీ టీఆరెస్ పేరును ‘తిరుగులేని రాజకీయ శక్తి’ పార్టీగా అభివర్ణించారు. పాలేరు ఉప ఎన్నికలో విపక్షాలన్నీ జట్టు కట్టి బరిలోకి దిగినా, తుమ్మల విజయాన్ని అడ్డుకోలేవని ఆయన వ్యాఖ్యానించారు. టీఆరెస్ కు తిరుగులేదని ఇప్పటికే నిరూపణ అయిందని.. ప్రతి ఎన్నికల్లోనూ తిరుగులేని విజాయాలు సాధిస్తున్నామని.. పాలేరులోనూ అదే విజయం పునరావృతం అవుతుందని కేటీఆర్ చెప్పారు.