Begin typing your search above and press return to search.

అచ్చం తండ్రిలా?; హెయిర్ స్టైల్ మార్చిన కేటీఆర్

By:  Tupaki Desk   |   1 March 2016 10:53 AM IST
అచ్చం తండ్రిలా?; హెయిర్ స్టైల్ మార్చిన కేటీఆర్
X
నిన్న టీవీల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ ను చూశారా? చూసి ఉంటే అతనిలో ఏమైనా మార్పు గమనించారా? మొన్నటి వరకూ కనిపించినా కేటీఆర్ కు.. నిన్న కనిపించిన కేటీఆర్ కు సంబంధించి స్టైల్ లో పెద్ద మార్పే చేసిన విషయాన్ని గుర్తించారా? ఇంతకీ కేటీఆర్ స్టైల్ లో వచ్చిన మార్పు ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం.

మొన్నటివరకూ యూత్ కి కేరాఫ్ అడ్రస్ గా కనిపించేటట్లు హెయిర్ స్టైల్ ఉన్న కేటీఆర్ అకస్మాత్తుగా తన హెయిర్ స్టైల్లో భారీ మార్పు తీసుకొచ్చారు. మొన్నటివరకూ జుట్టును వెనక్కి దువ్వుకొని యూత్ ఫుల్ గా కనిపించే కేటీఆర్.. తాజాగా మాత్రం తన తండ్రికి మాదిరి పక్కకు దువ్వుకొని దర్శనమిచ్చారు. నిజానికి దువ్వుకోవటంలో చిన్న మార్పే అయినప్పటికి చూసేటోళ్లు మాత్రం మొన్నటి కేటీఆర్ కు.. నిన్నటి కేటీఆర్ కు మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది.

మొన్నటి వరకూ యూత్ ఫుల్ గా కనిపించిన కేటీఆర్.. తాజా హెయిర్ స్టైల్లో మాత్రం కాస్త డిఫరెంట్ లుక్ తో.. తండ్రి కేసీఆర్ హెయిర్ స్టైల్ గుర్తుకు తెచ్చేలా ఉన్నారు. వయసులో కూడా కాస్త పెద్దరికం కనిపించినట్లుగా మాట్లాడుకోవటం కనిపించింది. హెయిర్ స్టైల్ లో మాత్రమే కాదు.. తండ్రి మాదిరి అధికారుల్ని చుట్టూ కూర్చోబెట్టుకొని చర్చలు జరపటం చూస్తే.. డిటో తండ్రిలానే అనిపించటం గమనార్హం.