Begin typing your search above and press return to search.
హ్యాపీ బర్త్ డే డాడ్ అని విషెస్ చెప్పాడు
By: Tupaki Desk | 17 Feb 2018 10:33 AM ISTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీలో ఒక విలక్షణత కనిపిస్తుంటుంది. కీలక కుటుంబ సభ్యులంతా వివిధ హోదాల్లో ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రిగానో.. పార్టీ అధినేతగానో సంబోధిస్తారే కానీ.. తండ్రిగా ప్రస్తావించటం కనిపించదు. చివరకు కేసీఆర్ సైతం.. తన కొడుకు.. కుమారుడు..మేనల్లుడు.. ఇలా ఎవరి విషయంలోనూ వారి పేర్లను.. హోదాను ప్రస్తావిస్తారే కానీ.. తమకున్న అనుబంధాల గురించి పెద్దగా మాట్లాడటం కనిపించదు.
పబ్లిక్ మీటింగ్ లలోనే కాదు.. ప్రైవేటు సంభాషణల్లోనూ నాన్నగారు ఏం చెప్పారంటే.. లాంటి మాటలు కేటీఆర్ నోటి నుంచి కానీ కవిత నోటి నుంచి కానీ రావు. ఇక.. ఏదైనా ముఖ్యసందర్భంలోనూ నాన్న అన్న మాట వారి నోటి వెంట రాదు. రాజకీయాల విషయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అన్న విషయాల్లో కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కు ఎవరూ ఏమీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.
అలాంటిది..తాజా కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కేటీఆర్ నోటి నుంచి కాస్తంత ఎమోషనల్ మాట రావటం కనిపించింది. ఆయన నిత్యం పోస్టులు చేసే ట్విట్టర్ లో తన తండ్రి పుట్టిన రోజు ముచ్చటను కాస్త భిన్నంగా చెప్పుకున్నారు. పార్టీ అధ్యక్షుల వారు.. ముఖ్యమంత్రి వర్యులు అని కాకుండా హ్యాపీ బర్త్ డే డాడ్ అని పోస్ట్ పెట్టేయటమే కాదు. ఆకాశానికి ఎత్తేలా.. తండ్రిని కీర్తిస్తూ ఒక ఫోటోను.. చిన్న కవితను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సరిగ్గా అర్థరాత్రి 12 గంటల వేళలో ఈ ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది.
చదివినంతనే ఆకట్టుకునేలా.. తన తండ్రిని ఏ స్థాయిలో పొగడగలరో.. ఆ స్థాయిలో కీర్తిస్తూ సాగిన కవితను చూస్తే..
వీరాధి వీరుడు అతడు
విజయానికి బావుటా అతడు
ఆవేశపు విల్లంభతడు
ఆలోచన శిఖరంబతడు
తల వంచని యోదుడు అతడు
అభయానికి బాసట అతడు
జనహితమై అభిమతమై సాగుతున్న గౌతముడు..