Begin typing your search above and press return to search.
కేటీఆర్ రేంజ్ చెప్పేసిన మెట్రో ఓపెనింగ్!
By: Tupaki Desk | 25 Sept 2018 11:40 AM ISTకేటీఆర్ అంటే మాటలా? పేరుకు తెలంగాణ రాష్ట్ర తాజా మాజీ మంత్రి అయినా.. ఆయన చుట్టూనే పవర్ అంతా. ఆయన రేంజ్ ఏమిటన్నది ఎల్ బీ నగర్ మెట్రో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా చూస్తే అర్థమవుతుంది. సీఎస్.. ఇద్దరు సీపీలు.. జీహెచ్ ఎంసీ కమిషనర్ ఇలా.. ఒకరు కాదు ఇద్దరు కాదు.. అధికారులంతా ఆయన కోసం పడిన శ్రమ అంతా ఇంతా కాదు.
ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థానంలో ఉన్న వారికి ఇన్ని తిప్పలు ఉంటాయా? అన్న సందేహం కలిగేలా ఎల్ బీ నగర్ మెట్రో ఓపెనింగ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే ఇట్టే అర్థమవుతాయి. ఆ మాటకు వస్తే కేటీఆర్ ఏమీ సీఎం కాదు. ఆయన మిగిలిన మంత్రుల మాదిరే. తాజా మాజీ. కాకుంటే.. కేసీఆర్ కొడుకన్న ఒక ట్యాగ్ అదనంగా ఉంది. అదే ఆయన హవా ఎంత నడవాలో అంత నడిచేలా చేస్తుందని చెప్పాలి.
అయితే.. కేటీఆర్ వైపు వేలెత్తి చూపించకుండా ఉండేందుకు గవర్నర్ ఉన్నారని చెప్పాలి. మెట్రో ఓపెనింగ్ కు ఇంత పెద్ద స్థాయిలో అధికారులు హాజరు కావటానికి కారణం.. ఆపద్దర్మ ప్రభుత్వం నడుస్తుండటం.. గవర్నర్ చేతుల మీదుగా స్టార్ట్ కావటం. మరి.. ముఖ్య అతిధి గవర్నర్ అయినప్పుడు ఆయనకు ప్రాధాన్యత ఉండాలే కానీ.. తాజా మాజీ మంత్రిగా ఉన్న కేటీఆర్ కు ఇచ్చిన ప్రయారిటీ అంతా ఇంతా కాదు.
ఆ మాటకు వస్తే.. కేటీఆర్ తీరును.. ఆయనకు అధికారులు వంగి వంగి సలాములు చేస్తున్న వైనం చూసినప్పుడు.. ఆయన యాక్టింగ్ సీఎంలా ఉన్నారే తప్పించి.. తాజా మాజీ మంత్రిగా అస్సలు కనిపించలేదన్న మాట వినిపించింది. నిజానికి కేటీఆర్ తో పాటు.. తాజా మాజీ మంత్రులైన నాయిని.. తలసాని శ్రీనివాస్ యాదవ్.. పద్మారావు ఉండనే ఉన్నారు. కానీ.. వారెవరికీ లేని గుర్తింపు కేటీఆర్ సొంతంగా చెప్పాలి.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. నాయిని.. తలసాని.. పద్మారావులను పట్టించుకున్న వారే లేరు. ఓపక్క గవర్నర్ ఉన్నా.. కేటీఆర్ ప్రధాన ఆకర్షణగా సాగిన మెట్రో ఓపెనింగ్ కార్యక్రమాన్ని చూస్తే.. రానున్న రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అన్న మాటకు మరింత బలం చేకూరేలా తాజా పరిణామాలు ఉన్నాయని చెప్పక తప్పదు. కేసీఆర్ కొడుకా మజాకానా?