Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు కేటీఆర్ ట్వీట్ రిక్వెస్ట్‌

By:  Tupaki Desk   |   23 March 2019 1:35 PM IST
ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు కేటీఆర్ ట్వీట్ రిక్వెస్ట్‌
X
ఇటీవ‌ల కాలంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన మ‌రే అధినేత చేయ‌ని రీతిలో తెలంగాణ‌ను ఉద్దేశించి.. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత‌ల గురించి కానీ.. తెలంగాణ అధికార‌ప‌క్షం గురించి.. తెలంగాణ సీఎం గురించి ఘాటు వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఆంధ్రా రాజ‌కీయాల్లో కేసీఆర్ వేలు పెట్టార‌ని.. తెలంగాణ‌లో ఆంధ్రా వారిని కొడుతున్న‌ట్లుగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై కేసీఆర్ రియాక్ట్ అవుతార‌న్న అంచ‌నాల‌కు భిన్నంగా.. ప‌వ‌న్ వ్యాఖ్య‌లు ప్రింట్ మీడియాలో పెద్ద ఎత్తున ప‌బ్లిష్ అయిన నేప‌థ్యంలో గంట‌ల వ్య‌వ‌ధిలోనే కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఆంద్రా రాజ‌కీయాల్లోకి రావాలంటే పార్టీ ఏర్పాటు చేయాల‌ని.. అభ్య‌ర్థుల్ని బ‌రిలోకి దించాలే కానీ.. జ‌గ‌న్ కు అడ్డ‌దారిలో స‌పోర్ట్ చేయ‌టం స‌రికాదంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.

త‌న పార్టీలోకి వ‌స్తామ‌న్న నేత‌లు.. ఆ వెంట‌నే జ‌గ‌న్ పార్టీలో చేరార‌ని.. ఎందుకంటే తెలంగాణ‌లో ఆస్తులు ఉన్న‌ట్లుగా త‌న‌కు చెప్పార‌ని.. అప్ప‌ట్లో ఆ మాట‌కు అర్థం తెలీలేదు కానీ ఇప్పుడు అర్థ‌మ‌వుతుంద‌న్నారు. ఇలాంటి వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ తాజాగా రియాక్ట్ అయ్యారు.

మీ ఆలోచ‌న‌ల‌కు భిన్నంగా మీరు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు భావిస్తున్నా.. మీకు తెలుసు.. తెలంగాణ 29 రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు నివాస‌యోగ్య‌మైన‌ది.. ఎలాంటి భేద‌భావాలు క‌ల‌గ‌ని రీతిలో ఉంటుంద‌ని..ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు నెగిటివిటిని పెంచుతాయ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోవ‌ద్దంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అధికార‌ప‌క్షం తీరును త‌ప్పు ప‌ట్టిన ప‌వ‌న్ వ్యాఖ్య‌లు తెలంగాణ మీద ప్ర‌భావం చూపిస్తాయ‌ని చెబుతున్న కేటీఆర్.. నేటికి త‌న ప్ర‌సంగాల్లో కేసీఆర్ ఆంధ్రా పాల‌న‌.. ఆంధ్రా దోపిడీత‌నం గురించి అదే ప‌నిగా మాట్లాడిన‌ప్పుడు ఈ సోయి ఏమంది? మ‌రి.. కేటీఆర్ ట్విట్ రిక్వెస్ట్ కు ప‌వ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.