Begin typing your search above and press return to search.

జీహెచ్ఎంసీలో టీఆర్ ఎస్ కు ఆ ఒక్కడు!

By:  Tupaki Desk   |   30 Nov 2020 4:20 PM IST
జీహెచ్ఎంసీలో టీఆర్ ఎస్ కు ఆ ఒక్కడు!
X
గ్రేటర్ ఎన్నికల వేళ తెరవెనుక ఉండి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చక్రం తిప్పుతుంటే తెరముందు మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శాయశక్తులు ఒడ్డుతున్నారు. ప్రచారంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అభ్యర్థులకు అండగా నిలుస్తూ గెలుపుపై భరోసా కల్పిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం ఎజెండాతో కేటీఆర్ దూసుకెళ్లింది.

సికింద్రాబాద్ నియోజకవర్గంలోని శాంతినగర్ లో చివరిరోజు ప్రసంగాన్ని కేటీఆర్ ముగించారు. జుమ్మేరాత్ బజార్, పాటిగడ్డలో నిర్వహించిన రోడ్డు షోలో బీజేపీ ముఖ్యనేతలతో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నగరంలో వారం రోజుల పాటు ఆయన విరామం లేకుండా 15 నియోజకవర్గాలు, 33 ప్రాంతాల్లో రోడ్ షోల్లో సభలు, సమావేశాల్లో నిర్వహించారు.

ప్రతిచోటా కేటీఆర్ కు జనం నీరాజనాలు పలికారు. ఉదయం సామాజికసంఘాలు, డెవలప్ మెంట్ ఫోరాలతో ప్రత్యేక భేటీలు నిర్వహించారు. సాయంత్రం రోడ్డు షోల్లో పాల్గొన్నారు.

మొత్తంగా కేటీఆర్ ఇప్పటిదాకా 100 డివిజన్ల ఓటర్లను తన సభల ద్వారా కలుసుకున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలంతా డివిజన్లకు పరిమితం కాగా ప్రచార వ్యూహం, ప్రతిపక్షాలపై విమర్శల దాడి వంటి అంశాల్లో కీలకంగా నిలిచారు.