Begin typing your search above and press return to search.

కేటీఆర్ కు పార్టీ పగ్గాలు.. కేసీఆర్ సంచలనం

By:  Tupaki Desk   |   14 Dec 2018 10:37 AM IST
కేటీఆర్ కు పార్టీ పగ్గాలు.. కేసీఆర్ సంచలనం
X
రెండోసారి ఫుల్ మెజార్టీ సాధించిన కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు - సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్ టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పజెప్పారు. తన తరువాత పార్టీలో - ప్రభుత్వంలో కేటీఆర్ నంబర్ 2 అని కేసీఆర్ ఈ నిర్ణయంతో చెప్పకనే చెప్పారు..

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావాలని.. భావించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కేటీఆర్ కు అప్పగించినట్లు కేసీఆర్ తెలిపినట్లు టీఆర్ ఎస్ వర్గాలు తెలిపాయి. జిల్లాలో పార్టీ సభ్యత్వాలు.. జిల్లా కార్యాలయాల నిర్మాణాలను కేటీఆర్ కు అప్పగించబోతున్నట్టు కేసీఆర్ ప్రకటనలో తెలిపారు.

టీఆర్ ఎస్ పార్టీని తాను అనుకున్న విధంగా తీసుకుపోవడం.. తనకు ఎంతో నమ్మకమైన వ్యక్తికి పార్టీ బాధ్యతలు అప్పగించాలన్న కేసీఆర్ మనోభిష్టం మేరకు కేటీఆర్ కు ఈ పదవి అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేటీఆర్ ను టీఆర్ ఎస్ లో అత్యంత విశ్వసనీయమైన నేతగా తాను భావిస్తున్నట్టు కేసీఆర్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

కేటీఆర్ గడిచిన జీహెచ్ ఎంసీ ఎన్నికలతోపాటు తాజాగా హైదరాబాద్ లోని చాలా సీట్లను గెలిపించి గెలుపులో కీలకపాత్ర పోషించిన కేటీఆర్ కు రెండో దఫా గెలవగానే కేసీఆర్ పూర్తిస్తాయిలో పార్టీ బాధ్యతలు అప్పగించడం విశేషంగా మారింది.