Begin typing your search above and press return to search.

ఆనంద్ మహీంద్రా చిరకాల కలను తీర్చిన కేటీఆర్.. ఏమిటది?

By:  Tupaki Desk   |   18 Jan 2022 3:57 AM GMT
ఆనంద్ మహీంద్రా చిరకాల కలను తీర్చిన కేటీఆర్.. ఏమిటది?
X
ప్రముఖ వ్యాపారవేత్త అయినప్పటికి సోషల్ మీడియాలో ఆయనెంత చురుగ్గా ఉంటారో తెలిసిందే. సోషల్ మీడియాను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి సుపరిచితులు మహీంద్రాగ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా. తాజాగా ఆయన ఒక ట్వీట్ చేశారు. అందులో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను మనస్ఫూర్తిగా అభినందించారు. కాసింత ఎమోషనల్ అయిన ఆయన.. తన చిరకాల స్వప్నాన్ని తీర్చినందుకు మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇంతకీ అంతలా ఆనంద్ మహీంద్రా మనసును కేటీఆర్ ఏ రీతిలో గెలుచుకున్నారు? అసలేమైందన్న విషయంలోకి వెళితే..

సోమవారం హైదరాబాద్ లో ‘ఫార్ములా ఈ’ సహ వ్యవస్థాపకుడు.. చీఫ్ చాంపియన్ షిప్ ఆఫీసర్ అల్బెర్టో లాంగో తో కలిసి టీ మంత్రి కేటీఆర్ లు సంయుక్తంగా ‘‘ఎబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా ఇ’’ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీల నిర్వహణ గురించి అధికారిక ప్రకటన చేశారు. ఈ పోటీల నిర్వహణకు హైదరాబాద్ మహానగరాన్ని వేదికగా ప్రకటించటంపై ఆనందం వ్యక్తమవుతోంది.

దీంతో.. హైదరాబాద్ లో తొలిసారి తమ సొంత రేసింగ్ కార్లు సొంత దేశంలో పరుగులు తీయటానికి అవకాశాన్ని ఇవ్వటంపై మంత్రి కేటీఆర్ ను అభినందించారు. ఈ ఆనందంలో ఒక ట్వీట్ చేసి.. తన అభిమానాన్ని చాటుకున్నారు. తన చిరకాల కల నెరవేరినట్లుగా మహీంద్ర ఆనంద్ పేర్కొన్నారు. ఇదంతా ఎందుకంటే.. మహీంద్రా ఆనందర్ కు సొంత రేసింగ్ కార్ల యూనిట్ ఉంది. వాటిని స్వదేశంలో పరుగులు తీయించాలని కోరిక ఉంది కానీ.. జరగలేదు.

ఇలాంటి పరిస్థితుల్లోహైదరాబాద్ లోకి దీన్ని తీసుకురావటం కచ్ఛితంగా హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుందన్న మాట ఖాయం. సొంత గడ్డపై తమ కార్లు పరుగులు తీయటాన్ని తలుచుకొని మహీంద్రా ఆనంద్ ఎక్సైట్ అవుతున్నారు. ఇంతకీ ఈ ‘‘ఫార్ములా-ఈ’ రేసింగ్ అంటే ఏమిటి? అన్న సందేహం కలుగక మానదు. అత్యంత వేగంగా దూసుకెళ్లే ఫార్ములా వన్ రేసింగ్ గురించి అందరికి తెలిసిందే. మలుపులు తిరుగుతూ దూసుకెళ్లే ఈ కార్లలో శిలాజ ఇంధనాలు వాడతారు. అందుకు భిన్నంగా ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే ప్రపంచ స్థాయి రేసింగ్ పోటీలే.. ‘‘ఫార్ములా - ఈ’’.

ప్రపంచంలో అత్యంత వేగంగా ఆదరణ పొందుతున్న కార్ రేసింగ్ గా దీన్ని చెబుతారు. ఈ కార్ రేసింగ్ చాంపియన్ షిఫ్ ను ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్లకు పైనే వీక్షిస్తారన్నది ఒక అంచనా. ఇలాంటివేళ.. ప్రస్తుతం దుబాయ్ లో జరిగే ఈ టోర్నీ.. తర్వాతి వేదిక హైదరాబాదే. దీనికి సంబంధించిన ఒప్పందం తాజాగా పూర్తైంది. ఈ సందర్భంగా ఎక్సైట్ మెంట్ కు గురైన ఆనంద్ మహీంద్రా మంత్రి కేటీఆర్ కు థ్యాంక్స్ చెప్పారని చెప్పాలి.