Begin typing your search above and press return to search.
కింద పడ్డా మనదే పైచేయి అన్న కేటీఆర్!
By: Tupaki Desk | 28 May 2019 5:20 PM ISTకింద పడ్డా పైచేయి మాదే అంటూ వెనకటికొకడు అన్న సామెతను గుర్తు చేసేలా టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఊహించని ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో.. ఆ ఓటమిపై కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారన్న సందేహం తాజా వ్యాఖ్యలతో తీరిపోయిందని చెప్పాలి.
ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికకు టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్ కుమార్ నామినేషన్ వేసే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో చెల్లని కాసు.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే చెల్లుతుందా? అంటూ ఎటకారం చేసిన కేటీఆర్ కు పంచ్ పడేలా.. తెలంగాణ ఓటర్లు తీర్పు ఇవ్వటం తెలిసిందే.
ఈ ఇబ్బందికర పరిస్థితిని కేటీఆర్ తనకున్న కవరింగ్ అర్ట్ తో అదరగొట్టేశారు. ఇప్పటివరకూ ఆయనలో బయటకు రాని ఈ కొత్త కళ బయటకు రావటమే కాదు.. అందులో తనకున్న నైపుణ్యంతో మీడియా ప్రతినిధుల నోట మాట రాని విధంగా మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో తాము ఆశించినంత ఫలితాలు రాలేదని.. లోక్ సభ ఎన్నికల్లో తమకు సీట్లు పోయినా.. ఓటు శాతం పెరిగిందని.. గతానికి మించి ఆరు శాతం ఓట్లు టీఆర్ఎస్ కు వచ్చాయన్నారు. అయితే.. ఈ ఆరుశాతం ఓట్లు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించా? 2014లో జరిగిన ఎన్నికలకు సంబంధించా అన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీ వెంట్రుక వాసిలో గెలిచిందని.. రేవంత్ రెడ్డి గెలుపు ఒక గెలుపు కాదని తేల్చేశారు.
లోక్ సభ ఎన్నికల ఫలితాలు తమకు స్పీడ్ బ్రేకర్ లాంటివేనని చెప్పిన ఆయన దేశ వ్యాప్తంగా మోడీ హవా ఉన్నప్పటికి టీఆర్ ఎస్ మంచి సీట్లను గెలుచుకుందన్నారు. అదిలాబాద్ ఎంపీ స్థానాన్ని బీజేపీ గెలుస్తుందని తాము ఊహించలేదన్న ఆయన.. ఈసారి ఎన్నికలలో చిత్రమైన ట్రెండ్ కనిపించిందన్నారు. వరుస ఎన్నికలు.. పాలనలో జాప్యం కూడా ఫలితాల మీద ప్రభావం పడిందేమోనన్న విషయాన్ని విశ్లేషిస్తామని చెప్పారు. సిరిసిల్లలో బీజేపీకి కార్యకర్తలు కూడా లేరని.. కానీ.. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయన్నారు. తాజా ఫలితాలతో కార్యకర్తలు ఆందోళన పడొద్దని.. వరంగల్ లో టీఆర్ఎస్ కు వచ్చిన మెజార్టీ మిగిలిన అన్ని చోట్ల బీజేపీ.. కాంగ్రెస్ గెలిచిన అభ్యర్థుల కంటే ఎక్కువ వచ్చిందన్నారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎక్కడా ఫెయిల్ కాలేదని చమత్కరించారు.
అయ్యా.. కేటీఆర్ ఇప్పుడు మీ కవరింగ్ అంతా మీరు ఫెయిల్ కాలేదని చెప్పటానికే అయితే.. అసలు మీరు ఫెయిల్ అయ్యారన్న మాట మాట్లాడే సాహసం మేం ఎందుకు చేస్తాం చెప్పండి? ఒక్క ఓటుతో గెలిచినా.. లక్ష ఓట్లతో గెలిచినా.. సీటు పోయిందా? లేదా? అన్న లెక్క మీరు చెప్పాలి.. మేం వినాలి. నిజమే.. వచ్చిన మెజార్టీని చూసి మురిసిపోవాలే కానీ.. ఓటమిని తలుచుకొని బాధ పడాలా ఏంది? గెలుపు మజానే కానీ.. ఓటమి చేదు మనకు అక్కర్లేదన్న విషయాన్ని భలేగా చెప్పారుగా. మీరు చెప్పారు కాబట్టి.. పార్టీ కార్యకర్తలు ఫీల్ కారులెండి. మళ్లీ చెబుతున్నాం.. మీరు ఎక్కడా ఫెయిల్ కాలేదు బాస్!