Begin typing your search above and press return to search.

పశ్చిమ గోదావరి జిల్లాలో క్షుద్రపూజల అలజడి !

By:  Tupaki Desk   |   20 July 2020 1:45 PM IST
పశ్చిమ గోదావరి జిల్లాలో క్షుద్రపూజల అలజడి !
X
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో భయంతో వణికిపోతున్న ప్రజలని క్షుద్రపూజలు మరింత ఆందోళనకి గురిచేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కేతవరం పంచాయతీ పరిధి కృష్ణంపాలెం గ్రామంలో ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేస్తున్నారనే వార్త కలకలం సృష్టించింది. ఆ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు , అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ముగ్గురు కలిసి గ్రామ శివారులో శనివారం అర్ధరాత్రి క్షుద్రపూజలు చేస్తున్న సమయంలో అది గమనించిన గ్రామస్థులు క్షుద్ర పూజలు జరగకుండా అడ్డుకున్నారు.

కృష్ణంపాలెం గ్రామ శివారులో శనివారం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా అర్ధరాత్రి అరుపులు, గట్టిగా భయపడేలా మంత్రాలు విన్న కొందరు గ్రామస్థులు ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా అక్కడ కొందరు క్షుద్రపూజలు చేస్తున్నారు. దీనితో ఆ గ్రామస్థులు వెంటనే అక్కడ క్షుద్రపూజలు జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని, అక్కడ క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఆదివారం గ్రామంలో రెండు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీనిపై పెద్దలు కలగజేసుకుని వివాదాన్ని సద్దుమణిగించారు.