Begin typing your search above and press return to search.

ఎయిర్ ​పోర్ట్​ లో పట్టుబడ్డ ముంబై స్టార్ ఆల్ రౌండర్

By:  Tupaki Desk   |   13 Nov 2020 8:45 AM IST
ఎయిర్ ​పోర్ట్​ లో పట్టుబడ్డ ముంబై స్టార్ ఆల్ రౌండర్
X
ముంబై ఇండియన్స్​ స్టార్​ ఆల్ రౌండర్​ క్రునాల్​ పాండ్యా దుబాయ్ నుంచి అనుమతి లేకుండా అధిక బంగారం, కొన్ని విలువైన వస్తువులు తీసుకొచ్చి ముంబై ఎయిర్​పోర్ట్​ అధికారులకు దొరికినట్టు సమాచారం. అధికారులు పాండ్యాను విచారిస్తున్నారు. ఐపీఎల్-13 సీజన్ ​ పూర్తిచేసుకుని స్వదేశానికి చేరిన ముంబై ఇండియన్స్​ ఆల్​రౌండర్​ క్రునాల్​ పాండ్యాను ఎయిర్​పోర్ట్​లో డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​ అధికారులు తనిఖీ చేశారు. అయితే అతడి వద్ద ఖరీదైన వాచీలు, కొంతబంగారం ఉండటంతో క్రునాల్​ను అధికారులు ఎయిర్​పోర్ట్​లో నిలిపివేశారు.

తమ కార్యాలయంలోకి తీసుకెళ్లి ప్రశ్నించారు. అయితే చట్టాలమీద అవగాహన లేకపోవడం వల్ల తాను వీటిని తీసుకొచ్చానని క్రునాల్​ అధికారులకు చెప్పినట్టు సమాచారం. ఇటీవల క్రునాల్ తన సోదరుడు హార్థిక్​పాండ్యాతో కలిసి షాపింగ్​ చేశారు. అప్పుడు వాళ్లిద్దరు కొన్ని వస్తువులను కొనుగోలు చేశారు. క్రునాల్​ వద్ద రెండు రోలెక్స్​ వాచీలు, మరో రెండు ఖరీదైన వాచీలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వాటి విలువ రూ. 75 లక్షల కంటే ఎక్కువేనని సమాచారం. యూఏఈ నుంచి అనుమతి లేకుండా వస్తువులు తీసుకురావడంతో అతడిని తనిఖీ చేసినట్టు సమాచారం.

ఐపీఎల్ సీజన్ ముగియగానే క్రునాల్​, హార్థిక్​ పాండ్యాతో కలిసి షాపింగ్​ చేశారు. వీళ్లిద్దరూ కొన్ని వాచీలు, కొంతబంగారం కొనుగోలు చేసినట్టు సమాచారం. అయితే హార్థిక ఆస్ట్రేలియా టూర్​కు ఎంపికకావడంతో తోటి క్రికెటర్లతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. అతడు బంగారం, వస్తువులను కూడా క్రునాల్​ తీసుకురావడంతో అధికారులు తనిఖీ చేశారు. తనకు చట్టాలపై అవగాహన లేకపోవడంతో ఇలా తీసుకొచ్చానని క్రునాల్​ వివరణ ఇచ్చినట్టు సమాచారం. చివరకు అతడి బంగారాన్ని అధికారులు సీజ్​ చేశారు. షాపింగ్ సంబంధించిన పత్రాలు చూపించడంతోపాటు 60 శాతం ఫైన్​ కట్టడంతో క్రునాల్​కు వస్తువులను తిరిగి ఇచ్చేసినట్టు సమాచారం. ఈ విషయం ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది.