Begin typing your search above and press return to search.

ట్రంప్ ర‌ష్యా ఏజెంట్ అంట‌

By:  Tupaki Desk   |   25 July 2016 6:26 AM GMT
ట్రంప్ ర‌ష్యా ఏజెంట్ అంట‌
X
రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్‌ ట్రంప్ పై కొత్త ఆరోప‌ణ తెర‌మీద‌కు వ‌చ్చింది. అమెరికా అంటే ఇంతెత్తున ఎగిరిప‌డే ర‌ష్యా కోసం ట్రంప్ ర‌హ‌స్యంగా ప‌నిచేస్తున్నాడంట‌. ఆ ఆరోప‌ణ ఎవ‌రో ఆషామాషీగా చేయ‌లేదు. న్యూయార్క్‌ టైమ్స్‌ కాలమిస్ట్‌ - ఆర్ధికవేత్త పాల్‌ క్రూగ్‌ మన్ ఈ మేర‌కు ట్రంప్ రష్యా ఏజెంట్ అంటూ విరుచుకుపడ్డారు. త‌న వ్యాసంలో ఆయన ట్రంప్‌ పై విమ‌ర్శలు గుప్పించారు.

ర‌ష్యా ర‌థ‌సార‌థి వ్లాదిమిర్‌ పుతిన్‌ కు రహస్య ఏజెంట్‌ రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌ అని మండిప‌డ్డారు. ఈ కాలమ్‌ కు ఏకంగా ఆయన 'సైబేరియన్‌ కేండిడేట్‌' అని శీర్షిక కూడా పెట్టారు. అమెరికాలో సోవియట్ యూనియ‌న్‌ పన్నిన రాజకీయ కుట్రను అమలు చేసేందుకు వచ్చిన హంతకుడు అంటూ వ్యాఖ్యానించారు. అమెరికా మిత్రపక్షాలను పణంగా పెట్టి - తన స్వప్రయోజనాలను మూల్యంగా చెల్లించి ట్రంప్‌ పుతిన్‌ అనుకూల విదేశాంగ విధానాన్ని అనుసరిస్తారంటూ ఆ కాలమ్‌ ఆరోపించింది. సంపన్నులైన రష్యన్లతో ట్రంప్‌ కు గల సంబంధాలను ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ ట్రంప్‌ ప్రభావితం కావడానికి కొన్ని దారులు ఉండి ఉండవచ్చునంటూ క్రూగ్‌ మన్‌ వ్యాఖ్యానించారు. ఇక్కడేదో వింతైన విషయాలు చోటు చేసుకుంటున్నాయి, వాటిని ఎంత మాత్రమూ విస్మరించరాదని అన్నారు. క్లీవ్‌ లాండ్‌ లో రిపబ్లికన్‌ జాతీయ సదస్సు సందర్భంగా న్యూయార్క్‌ టైమ్స్‌ కు ట్రంప్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్న విదేశాంగ విధాన అంశాలపై క్రూగ్‌ మన్‌ ఈ కాలమ్‌ లో వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రష్యా ఆకస్మిక దాడి జరిపిన పక్షంలో అధ్యక్షుడిగా బాల్టిక్‌ దేశాలకు వెంటనే సైనిక సాయం చేస్తారా లేదా అని ప్రశించగా ట్రంప్‌ సందిగ్ధంగా సమాధానం ఇచ్చారు. మూడు చిన్న చిన్న పూర్వపు సోవియట్‌ రిపబ్లిక్‌ ల కోసం రష్యాతో యుద్ధం ముఖ్యంగా అణు యుద్ధం చేయడానికి అమెరికా సన్నద్ధంగా వుందా లేదా అనే విషయమై మెజారిటీ అమెరికన్లకు ఎలాంటి ఆలోచన లేదు. క్రూగ్‌ మన్‌ వంటి మీడియా పండితులు ట్రంప్‌ తో విభేదించడానికి ఇదొక అంశం.

ఇదిలాఉండ‌గా కేవలం క్రూగ్‌ మన్‌ మాత్రమే కాదు, ఇతర మీడియా - పత్రికలు కూడా ఈ విషయంలో దాదాపు ఇలానే వ్యవహరించాయి. ''వ్లాదిమిర్‌ పుతిన్‌ తో పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్‌'' అని మరో శీర్షికతో ఒక వ్యాసం ప్రచురితమైంది. అట్లాంటిక్‌ కు చెందిన జెఫరీ గోల్డ్‌ బెర్గ్‌ ఇలా రాశారు. ''రిపబ్లికన్‌ నామినీ డొనాల్డ్‌ ట్రంప్‌ తనను తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఏజెంట్‌ ఈవారం రుజువు చేసుకున్నారు.'' అని వ్యాఖ్యానించారు. ''ట్రంప్‌ ఎన్నికైతే అమెరికాలో కుట్ర తప్పదు'' అని మరో వ్యాఖ్య కూడా మీడియాలో ప్రచురితమైంది. లాస్‌ ఏంజెల్స్‌ టైమ్స్‌ పత్రికలో జేమ్స్‌ కిర్‌ చిక్‌ ఈ వ్యాఖ్య రాశారు.