Begin typing your search above and press return to search.

విజ‌య‌నిర్మ‌ల‌కు కోటి రూపాయ‌ల టోక‌రా

By:  Tupaki Desk   |   2 Nov 2016 5:58 AM GMT
విజ‌య‌నిర్మ‌ల‌కు కోటి రూపాయ‌ల టోక‌రా
X
వ్యాపారంలో ఇబ్బందులు ప‌డుతున్నామంటే స‌హ‌క‌రించిన సూపర్‌ స్టార్ హీరో కృష్ణ సతీమణి - సీనియర్ దర్శకురాలు - సినీ నటి విజయనిర్మలను రియల్‌ ఎస్టేట్ వ్యాపారులు బురిడీ కొట్టించారు. నానక్‌ రామ్‌ గూడలో నివాసం ఉంటున్న విజయనిర్మలకు బంజారాహిల్స్ రోడ్ నెం1లోని విజన్ మెడోస్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు చెందిన నిర్వాహకులు ఆర్ శ్రీనివాసరాజు - ముదునూరి భధ్రిరాజు - శ్రీరామరాజులతో 20 ఏళ్లుగా పరిచయం ఉంది. వ్యాపారంలో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ చేబదులుగా రూ.కోటి ఇస్తే తమ కష్టాలు తీరుతాయని ఆమెను నమ్మించారు. వీరి మాటలను నమ్మిన విజయనిర్మల 2007లో వారికి డబ్బులు ఇచ్చారు.

అయితే స‌ద‌రు రియ‌ల్ వ్యాపారులు అనుకున్న సమయానికి డబ్బులు చెల్లించకపోగా వాయిదాల‌తో కాలం గడుపుతూ వచ్చారు. విసిగిపోయిన విజ‌య నిర్మ‌ల‌ రియల్టర్లు ఇచ్చిన చెక్కులను బ్యాంకులో జమచేయగా అవి బౌన్స్ అయ్యాయి. దీంతో విజయనిర్మల కోర్టును ఆశ్రయించారు. డబ్బులు తీసుకుని కాలయాపన చేస్తున్న ఆర్‌ శ్రీనివాసరాజు - భద్రిరాజు - శ్రీరామరాజులపై కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో వీరిపై ఐపీసీ 406 - 420 - 156(సీఆర్‌ పీసీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/