Begin typing your search above and press return to search.

ఇంట్లో వద్దన్నారు .. నేనే దైర్యం చేశా !

By:  Tupaki Desk   |   16 Jan 2021 2:14 PM GMT
ఇంట్లో వద్దన్నారు .. నేనే దైర్యం చేశా !
X
ఈ రోజు ఉదయం దేశంలో కొరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోని ప‌లు కేంద్రాల్లోనూ ప‌లువురికి వ్యాక్సిన్ వేశారు. గాంధీ ఆసుప‌త్రిలో కేంద్ర స‌హాయ‌మంత్రి కిష‌న్ రెడ్డితో పాటు తెలంగాణ‌ మంత్రి ఈటల రాజేంద‌ర్ వాక్సినేషన్ ప్రక్రియను స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో తోలి వ్యాక్సిన్ ను పారిశుద్ధ్య కార్మికురాలు కృష్ణ‌మ్మకు ఇచ్చారు.

ఇదిలా ఉంటే ..తెలంగాణ రాష్ట్రంలో తోలి కరోనా వైరస్ వ్యాక్సిన్ వేసుకోవొద్దు అని కుటుంబ సభ్యులు చెప్పినా కూడా ,తాను ఆ దేవుడి పై భారం వేసి , దైర్యం చేసి ముందుకు వచ్చినట్టు పారిశుద్ధ్య కార్మికురాలు కృష్ణ‌మ్మ తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు అని , ఇంజక్షన్ తీసుకున్న దగ్గర వాపు కూడా లేదు అని అన్నారు. కరోనా విజృంభణ సమయంలో తామెంతో కస్టపడి డ్యూటీలు చేశామని ,బస్సులు లేకున్నా కూడా నడిచి వచ్చి డ్యూటీలు సక్రమంగా చేశామని , ఇప్పుడు దానికి తగ్గ గుర్తింపు దక్కింది అని అన్నారు.

దీనిపై మంత్రి ఈటల మీడియాతో మాట్లాడుతూ క‌రోనా స‌మ‌యంలో ఎన్నో సేవ‌లు అందించి, కుటుంబ స‌భ్యుల‌కు సైతం దూరంగా ఉన్న‌ వైద్యులు, వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికుల‌కు ముందుగా వ్యాక్సిన్లు ఇవ్వాల‌ని చెప్పార‌ని తెలిపారు. ఆ ఆదేశాల ప్ర‌కార‌మే తెలంగాణ‌లో వ్యాక్సిన్ వేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని నిరంత‌రాయంగా కొన‌సాగిస్తామని తెలిపారు. క‌న‌ప‌డ‌ని వైర‌స్ కు వ్యాక్సిన్ ద్వారా చ‌ర‌మ‌గీతం పాడుతున్నామ‌ని తెలిపారు. ప్ర‌పంచానికి వ్యాక్సిన్ అందించే స్థాయిలో మ‌నం ఉన్నామ‌ని అన్నారు.