Begin typing your search above and press return to search.

వరద రాజకీయం.. టీడీపీకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పవర్ పంచ్!

By:  Tupaki Desk   |   17 Aug 2019 9:34 AM IST
వరద రాజకీయం.. టీడీపీకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పవర్ పంచ్!
X
కృష్ణా నదీ తీరం వరదలతో ఇక్కట్ల పాలవుతుంటే మీరు మాత్రం హైదరాబాద్ లో కూర్చుని ట్వీట్లు పెడతారా?' అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్ కు గట్టి ప్రశ్ననే సంధించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. కృష్ణా నది వరద చంద్రబాబు నాయుడు నివాసాన్ని చుట్టుముట్టిన పరిణామాల్లో ఆ విషయం పై చంద్రబాబు నాయుడు, లోకేష్ లు రియాక్ట్ అయిపోతూ ఉన్న తరుణంలో ఆళ్ల వేసిన ప్రశ్న చాలా వేలిడ్ గానే ఉంది.

చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన కరకట్ట నివాసంలో లేరు. ఆయన హైదరాబాద్ చేరుకుని కొన్ని రోజులు గడిచాయి. చంద్రబాబు నాయుడు ఇంటిని వరద చుట్టుకోలేదని తెలుగుదేశం వాళ్లు వాదిస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఆ ఇంట్లో లేరు. ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు అద్దె ఇళ్లు నివాస యోగ్యంగా ఉంటే ఆయన ఎంచక్కా అందులో ఉండొచ్చు.

అయితే ఆయన అందులో లేరు. కానీ టీడీపీ ఆ విషయంలో వాదిస్తూ ఉంది. నిజంగానే వరద ముప్పు లేకపోతే చంద్రబాబు నాయుడు ఆ ఇంట్లో ఎందుకు ఉండటం లేదు అనే సందేహం ఎవరికైనా వస్తుంది.
ఇక లోకేష్ కూడా కేరాఫ్ హైదరాబాద్ గానే ఉన్నారు. ఆయన ట్వీట్లన్నీ కృష్ణా నది వరదల గురించినే సాగుతూ ఉన్నాయి.

ఆ వరదలకు, చంద్రబాబు నాయుడు ఇంటిని వరద చుట్టుకోవడానికి కారణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే అని లోకేష్ వాదిస్తూ ఉన్నారు. అయితే ఈ వాదనలు డొల్లగా ఉన్నాయి. అంత పెద్ద వరదను రెండు నాటు పడవలను ఉపయోగించి చంద్రబాబు ఇంటి వైపు మళ్లిస్తున్నారని లోకేష్ వాదించడం కామెడీగా మారిందని పరిశీలకులు అంటున్నారు.

ఆ ట్వీట్లను కూడా లోకేష్ నాయుడు హైదరాబాద్ నుంచినే వేస్తూ ఉన్నారు. ఒకవైపు సొంత రాష్ట్రం, అందునా తను పోటీ చేసిన ప్రాంతం, రాజధాని ప్రాంతం వరదలతో సతమతం అవుతుంటే లోకేష్ కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇంతకు ముందు ఏపీ రాజకీయాలకు హైదరాబాద్ వేదిక కాదన్నట్టుగా వీరు మాట్లాడేవాళ్లు. అయితే వరదల సమయంలో కూడా వీళ్లు హైదరాబాద్ లో కూర్చుని ట్వీట్లు పెడుతూ రాజకీయం చేస్తుండటం పట్ల అనేక మంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ విషయాన్ని పట్టుకునే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పంచ్ లు వేశారు.