Begin typing your search above and press return to search.

పన్నెండేళ్లు దాటిన ప్రతి ఒక్కరికి అందుబాటులో కోవావ్యాక్స్..!

By:  Tupaki Desk   |   5 May 2022 7:11 AM GMT
పన్నెండేళ్లు దాటిన ప్రతి ఒక్కరికి అందుబాటులో కోవావ్యాక్స్..!
X
సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా బుధవారం రోజు కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి ఓ కీలక ప్రకటన చేశారు. 12 ఏళ్ల పైబడిన ప్రతీ ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ కొవావ్యాక్స్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. అయితే కొవావ్యాక్స్ పెద్ద వాళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందా అంటే.. అవును పన్నెండు సంవత్సరాలు దాటిన ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉంటుందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

అయితే కొవావ్యాక్స్ ఇండియాలోని చిన్నారులకు అందుబాటులో ఉంటుందని తెలిపిన మరుసటి రోజే సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా ఈ ప్రకటన చేయడం గమనార్హం. పిల్లల కోసం భారత దేశం తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఇదొక్కటే. యూరప్ దేశాల్లో కూడా కరోనా వ్యాక్సిన్ అయిన కొవావ్యాక్స్ ని అమ్ముతున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ 90 శాతం సమర్థవంతంగా పని చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

పిల్లలను రక్షించడానికి మరో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా వెల్లడించారు. గత వారం నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ సీరం సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ 12 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్కుల వాడొచ్చని అప్రూవల్ ఇచ్చింది. గతేడాది డిసెంబర్ లో ఇదే వ్యాక్సిన్ ను ఎమర్జెన్సీ యూజ్ కు వాడొద్దని ప్రభుత్వం నిషేధించింది.

అయితే కొవావ్యాక్స్ టీకాను కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చేర్చాలంటూ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కాగా.. కొవిడ్ టీకా రెండో డోసు, ప్రికాషన్ డోసుల మధ్య విరామ సమయాన్ని తగ్గించే విషయం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. ప్రస్తుతం ఈ రెండు డోసుల మధ్య వ్యవధి 9 నెలలు ఉండగా.. దీన్ని ఆరు నెలలకు తగ్గించే అంశంపైనా చర్య జరిగింది.

అలాగే విద్య, ఉద్యోగం, వాణిజ్యం కోసం విదేశాలకు వెళ్లే వారికి 9 నెలల విరామాన్ని తగ్గించి ప్రికాషన్ డోసు ఇవ్వాలని చర్చించినట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయానికి రాలేదట. ఈ క్రమంలోనే పిప్లలందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపిన మరుసటి రోజే సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఈ కామెంట్లు చేయడం చర్చకు దారి తీసింది.

ప్రస్తుతానికి మాత్రం 12 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికి కొవావ్యాక్స్ అందుబాటులో ఉంటుందని మాత్రం అధికారికంగా ప్రకటించారు. మరి క్షేత్ర స్థాయిలో ఈ టీకాలను ఎప్పటి నుంచి పిల్లలకు వేస్తారో మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రభుత్వం ఈ కొవావ్యాక్స్ కరోనా టీకా గురించి, అది ఎప్పుటి నుంచి క్షేత్ర స్థాయిలో అందుబాటులోకి తీసుకు వస్తారో చెప్పే వరకు మాత్రం తెలియదు.