Begin typing your search above and press return to search.

టీడీపీయా? వైసీపీయా? డైలమాలో కోట్ల

By:  Tupaki Desk   |   3 Feb 2016 8:19 AM GMT
టీడీపీయా? వైసీపీయా? డైలమాలో కోట్ల
X
అనంతపురం జిల్లా బండ్లపల్లిలో మంగళవారం జరిగిన రాహుల్ సభ తీవ్ర అవమానానికి గురైన మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి పార్టీ మారే ఆలోచనకు వచ్చారని తెలుస్తోంది. ఈ ఘటన తెలియగానే కోట్ల స్వభావం తెలిసిన నేతలు ఆయన కాంగ్రెస్ లో ఉండడం కష్టమని చెబుతున్నారు. దీంతో సీనియర్ నేత అయిన ఆయన కోసం వైసీపీ ప్రయత్నాలు ప్రారంబిచట్లు తెలుస్తోంది. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని కోట్ల స్వయంగా అనడంతో ఆయనకోసం వైసీపీ ప్రయత్నాలు వేగం చేసింది. టీడీపీ నేతలు కూడా ఆయన్ను తమ పార్టీలోకి తేవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ కూడా ఆయన్ను బుజ్జగించేందుకు సంప్రదింపులు జరుపుతోంది.

రాహుల్‌ సభకు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన అనుచరులతో కలిసి మంగళవారం వెళ్లారు. మాజీ కేంద్రమంత్రి అయిన కోట్ల సభ వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మీకు అనుమతి లేదంటూ అడ్డగించారు. తాను మాజీ కేంద్రమంత్రిని అని చెప్పిన వినలేదు. ఆ సమయంలో కోట్ల వేదికపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ ముఖ్యులు కూడా ప్రయత్నించలేదు. దీంతో అవమానంతో మనస్థానానికి గురైన కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి అక్కడి నుంచి వెంటనే వెనుదిరిగారు. సభ ముగిసిన తర్వాత విషయం తెలుసుకున్న రఘువీరారెడ్డి.. కోట్లను బుజ్జగించే ప్రయత్నం చేశారు. సభా వేదిక వద్దకు అనుమతించాల్సిన వారి లిస్టులో కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డికి బదులు కేఎస్‌ ప్రకాశ్‌ రెడ్డి అని ఉందని భద్రతా సిబ్బంది దాన్ని అర్థం చేసుకోలేకపోయారని రఘువీరా సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ఆయన తగ్గలేదని చెబుతున్నారు.

మరోవైపు కోట్ట పదేపదే అనుమానాలు భరిస్తూ తాను పార్టీలో ఉండలేనని తేల్చిచెప్పారు. అర్థరాత్రి వరకు తనసొంతూరులో పార్టీ కార్యకర్తలు, అనుచరులతో కోట్ల సమావేశమయ్యారు. వారి వద్ద తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అయితే.. మంగళవారం రాత్రి కాంగ్రెస్ నేతలు పల్లంరాజు, కనుమూరి బాపిరాజు, కాసు వెంకటకృష్ణారెడ్డి తదితరులు కోట్లకు ఫోన్ చేసి తొందరపడవద్దని కోరారు. కానీ కోట్ల మాత్రం శాంతించలేదని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అనుచరులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే యోచనలో కోట్ల ఉన్నారు.