Begin typing your search above and press return to search.
కొత్తపల్లితో ముద్రగడ : ఈ కలయిక ఏ సంచలనానికో...?
By: Tupaki Desk | 5 Jun 2022 9:00 PM ISTవైసీపీ నుంచి లేటెస్ట్ గా సస్పెండ్ అయిన మాజీ మంత్రి నర్సాపురంకి చెందిన కొత్తపల్లి సుబ్బారాయుడు ఇపుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టాక్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అయ్యారు. ఆయన మాటలు కూడా వాడిగా వేడిగా ఉంటున్నాయి. తాను ఏంటో చూపించి సత్తా చాటుతాను అని సవాల్ చేస్తున్నారు. వైసీపీకి తన విశ్వరూపమే చూపిస్తాను అని కొత్తపల్లి గర్జిస్తున్నారు.
ఇదిలా ఉండగా కొత్తపల్లి సుబ్బారాయుడుని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కలవడం ఇపుడు సరికొత్త చర్చకు తావు ఇస్తోంది. నరసాపురానికి వచ్చిన ముద్రగడ నేరుగా కొత్తపల్లి వద్దకు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీ రాజకీయమైన ప్రాధాన్యత సంతరించుకుంది. కాపు సామాజికవర్గంలో ముద్రగడకు బలమైన ముద్ర ఉంది. ముద్రగడ కాపుల కోసం ఎంత దూరమైనా అంటూ సాగిన నేత. అయితే ఆయన వైసీపీ ఏలుబడిలో పెద్దగా సౌండ్ చేయడంలేదు. అంతే కాదు ఆయన కాపు ఉద్యమం నుంచి కూడా వైదొలగారు.
ఇక ఆయన రాజకీయంగా ఆ మధ్య కొన్ని ప్రకటనలు చేసినా కూడా ఆ తరువాత సైలెంట్ అయ్యారు. ఇపుడు ఆయన మళ్లీ యాక్టివ్ అవుతున్నారా అన్నదే ఇక్కడ చర్చ. మరి ఇంతకీ ఈ ఇద్దరు నేతలు దేని మీద మాట్లాడుకుని ఉంటారు అన్నదాని మీద ఎవరి మటుకు వారు ఊహాగానాలు ప్రచారంలోకి తెస్తున్నారు.
కొత్తపల్లి బలమైన నాయకుడిగా నర్సాపురంలో ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో అయితే టీడీపీ లేకపోతే జనసేనల తరఫున బరిలోకి దిగాలని చూస్తున్నారు. మరి ముద్రగడ ఆయనకు ఏమైనా రాజకీయ సలహాలు ఇచ్చారా అన్నది కూడా చర్చగా ఉంది. అలాగే గోదావరి జిల్లాల రాజకీయం మొత్తం కాపుల మీద ఆధారపడుతుంది అని 2024లో వారే మెయిన్ రోల్ ప్లే చేస్తారు అని వార్తలు వస్తున్న టైమ్ లో ముద్రగడ కొత్తపల్లి భేటీ అన్నది సరికొత్త రాజకీయాన్ని ఆవిష్కరిస్తుందా అని కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.