Begin typing your search above and press return to search.
సుబ్బారాయుడుకి బై బై చెప్పేసినట్లేనా..?
By: Tupaki Desk | 23 March 2022 8:00 PM ISTపశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సీనియర్ పొలిటీషియన్. ఆయనకు వ్యక్తిగత ఇమేజ్ ఉంది. స్థానిక బలం, కుల బలం అన్నీ ఉన్నాయి. ఇక అన్ని పార్టీలలోనూ కలియ తిరిగిన అనుభవం ప్రత్యేకంగా ఆయన ఒక్కడికే సొంతం. ఒకనాడు చంద్రబాబునాయుడుకు కుడి భుజంగా ఈ జిల్లాలో ఉండే సుబ్బారాయుడు అదే పార్టీ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా కూడా పనిచేశారు. బయటకు వచ్చి ప్రజారాజ్యం, వైసీపీల్లో చేరినా ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓటమి తప్పలేదు.
కాంగ్రెస్ తరఫున 2012లో ఎమ్మెల్యేగా నర్సాపురం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఇక గత ఎనిమిదేళ్ళుగా ఆయన అధికారానికి దూరంగానే ఉన్నారు. ఒక విధంగా ఆయనకు కొంత అసహనంగా ఇది ఉంది. అదే టైం లో వైసీపీలో రెండు సార్లు చేరినా అందలం అయితే దక్కలేదు.
ఇవన్నీ కలిసే ఆయనలో కోపాన్ని పెంచాయి. అంతే నర్సాపురం జిల్లా కేంద్రం కావాలంటూ సుబ్బారాయుడు రిక్షాలు తొక్కారు. రోడ్ల మీద ఆందోళనలు చేశారు. మీటింగులు పెట్టారు, ర్యాలీలు తీశారు, ఆఖరుకు ఫ్రస్టేషన్ తో ఏకంగా తన చెప్పుతో తానే కొట్టేసుకున్నారు. ఇది ఏపీ రాజకీయాలలోనే సెన్సేషన్ అయింది. అయినా సుబ్బారాయుడు ఎక్కడా తగ్గడంలేదు.
తన పొలిటికల్ రూట్ మ్యాప్ ని తాను వేసుకునే పనిలో ఉన్నారు. మరి అధికార పార్టీలో ఉంటూ ఆ పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తే ఎలా ఉంటుంది. అందుకే సుబ్బారాయుడు చెప్పుదెబ్బల ఎపిసోడ్ కి కా లేట్ గా అయినా లేటెస్ట్ గా మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇంచార్జి మంత్రిగా ఉన్న పేర్ని నాని సుబ్బారాయుడు మీద సెటైర్లు వేశారు.
తప్పు చేసిన ప్రతీసారీ చెప్పుదెబ్బలు కొట్టుకోవాలంటే సుబ్బారాయుడు ఇప్పటికి ఇంకా చాలానే కొట్టుకోవాలని పేర్ని నాని అనడం విశేషం. అంతే కాదు సొంత పార్టీ మీద ఈ విధంగా చేయడమేంటని కూడా గుస్సా అయ్యారు. నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజుని రాజకీయంగా బదనాం చేయడం కోసమే సుబ్బారాయుడు చెప్పుదెబ్బల ఎపిసోడ్ కి తెర తీశారు అని కూడా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భీమవరాన్ని జిల్లా కేంద్రం చేస్తే ఎమ్మెల్యే ప్రసాదరాజుకు ఏం సంబంధమని కూడా పేర్ని నాని అన్నారు.
మొత్తానికి ఇవన్నీ చూస్తే ప్రసాదరాజుకు పూర్తిగా వైసీపీ హై కమాండ్ భరోసా ఉన్నట్లుగా తేలిపోయింది. ఇక కొత్తపల్లి వారు కొత్త రూటు వెతుక్కోవచ్చు అని చెప్పకుండానే పేర్ని నాని చెప్పేశారు అని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే సుబ్బారాయుడు కూడా ఏమీ వెనకా ముందూ ఆలోచించకుండా చేయలేదని అనుచరులు అంటున్నారు.
ఆయన కూడా జనసేన వైపు చూస్తున్నారని, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన ఆయన 2024 నాటికి తమ్ముడు పెట్టిన పార్టీలోకి వెళ్ళి రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు అంటున్నారు. మొత్తానికి సుబ్బారాయుడుకు వైసీపీ అయితే అనఫిషీయల్ గా బై బై చెప్పేసిందా అంటే అవును అనే తాజా పరిణామాలు చెబుతున్నాయి.