Begin typing your search above and press return to search.

బాక్సైట్ మైనింగ్ మీద ఆ మోజేంది గీతమ్మ

By:  Tupaki Desk   |   2 Dec 2015 10:21 AM IST
బాక్సైట్ మైనింగ్ మీద ఆ మోజేంది గీతమ్మ
X
కొన్ని కొన్ని అంశాల జోలికి వెళ్లటం కన్నా తప్పు పని మరొకటి ఉండదు. అదేం సిత్రమో కానీ.. విపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్ కు వ్యతిరేకంగా మాట్లాడిన తెలుగుదేశం నేతలు.. పవర్ లోకి వచ్చాక బాక్సైట్ మైనింగ్ మీద సానుకూలంగా మాట్లాడటం పెరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంటరై.. బాక్సైట్ ఇష్యూను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నేరుగా ఆయన దగ్గరకు తీసుకెళ్లి.. దాని వల్ల ఎంత ప్రమాదమో చెప్పటం.. దాంతో బాబు అలెర్ట్ అయి.. బాక్సైట్ మైనింగ్ ఇష్యూకు బ్రేక్ లు వేయటం తెలిసిందే.

తమ దృష్టికి తీసుకురాకుండానే బాక్సైట్ తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇచ్చిన వైనం తెలుసుకొని అవాక్కు అయిన పరస్థితి. అలాంటివి మళ్లీ జరగకూడదని వార్నింగ్ ఇచ్చారు కూడా. ఇదిలా ఉంటే.. విశాఖ మన్యంలో బాక్సైట్ మైనింగ్ కు అనుకూలంగా రాగాలు తీస్తున్నారు అరకు ఎంపీ కొత్తపల్లి గీత.

విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల్ని అడ్డుకుంటోంది అక్రమ మైనింగ్ కు పాల్పడే వారని చెబుతున్నారు. వారి ప్రభావానికి లోనై మన్యంలో గిరిజనలు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారని.. అక్రమ మైనింగ్ వ్యాపారుల ఆటగా ఆమె అభివర్ణిస్తున్నారు. బాక్సైట్ మైనింగ్ చేయటం వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అధ్యయనం చేసి సరైన జాగ్రత్తలు తీసుకొని ముప్పు తప్పించవచ్చంటున్నారు.

గిరిజనులకు నష్టం కలిగించే చర్యలు తాను చేయనని ఓ పక్క చెబుతున్న గీతమ్మ.. మరోవైపు బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా మాట్లాడటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఏపీ సర్కారు మీద తీవ్రప్రభావం చూపించే బాక్సైట్ తవ్వకాల విషయంలో ఎంపీ అంత ఉత్సాహాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.