Begin typing your search above and press return to search.

కోటం రెడ్డికి బెయిల్ సాక్ష్యాలు చూపిస్తే కాళ్లు పట్టుకుంటా

By:  Tupaki Desk   |   6 Oct 2019 8:53 AM GMT
కోటం రెడ్డికి బెయిల్  సాక్ష్యాలు చూపిస్తే కాళ్లు పట్టుకుంటా
X
వెంకటాచలం ఎంపీడీవో సరళపై దౌర్జన్యం చేసినట్లుగా తెరపైకి వచ్చిన ఉదంతం ఏపీలో సంచలనంగా మారింది. ఈ ఉదంతం విన్నంతనే.. చంద్రబాబు ప్రభుత్వంలో చింతమనేని వ్యవహారం గుర్తుకు రాక మానదు. అయితే.. పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత పోరు కారణంగానే..తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను టార్గెట్ చేసినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.

తప్పు చేసిన ఎవరైనా సరే.. చట్టం ముందు ఒక్కటే అన్న రీతిలో అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు అందిన గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. తాముఅరెస్ట్ చేసిన నెల్లూరు గ్రామీణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు.

ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కోటంరెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. తాను ఎంపీడీవో సరళ మీద దౌర్జన్యం చేసినట్లుగా ఆధారాలతో నిరూపిస్తే.. తాను ఆమె కాళ్లు పట్టుకుంటానని సవాలు విసిరారు. జిల్లా ఎస్సీ తనను కావాలనే అరెస్ట్ చేశారని ఆరోపించిన కోటంరెడ్డి.. అర్థరాత్రి 12 గంటలకు ఇంటికి రావటం ఏమిటని ప్రశ్నించారు. అరెస్టులో తమ పార్టీకి చెందిన కొందరు నేతల ప్రమేయం ఉన్నట్లుగా ఆయన ఆరోపించారు.

మహిళా అధికారిణిపై దౌర్జన్యం వ్యవహారంలో ఆధారాలు ుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. విచారణ జరిపి తనపై తప్పు ఉంటే చర్యలు జరపాలన్నారు.ఎలాంటి విచారణకైనా తానుసిద్ధమని ఆయన చెబుతున్నారు. మరి.. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.