Begin typing your search above and press return to search.

లక్ష్మీ విలాస్ బ్యాంక్ ను ఆ బ్యాంకులు కొనేయనున్నారా?

By:  Tupaki Desk   |   5 Oct 2020 10:00 AM IST
లక్ష్మీ విలాస్ బ్యాంక్ ను ఆ బ్యాంకులు కొనేయనున్నారా?
X
ఆర్థికంగా కష్టాల్లో ఉన్న బ్యాంకుల జాబితాలో తాజాగా లక్ష్మ విలాస్ బ్యాంక్ చేరింది. ఈ బ్యాంక్ ను క్లిక్స్ గ్రూపుతో విలీనం చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ అనుకున్న రీతిలో డీల్ సెట్ కాకపోతే పరిస్థితి ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. ఈ బ్యాంకును ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజమైన ఐసీఐసీలో కానీ..కొటాక్ బ్యాంకుల్లో ఏదో ఒకదాన్లో విలీనం చేసే వీలుందన్న మాట వినిపిస్తోంది.

కష్టాల్లో ఉన్న బ్యాంకుల్ని కొనటం.. దాన్ని సరిదిద్ది.. తమలో విలీనం అయ్యేలా చేసుకోవటంలో మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఐసీఐసీఐ బ్యాంకుతో పాటు.. కొటక్ బ్యాంకుకు దీన్ని కట్టబెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ మధుర.. సంగ్లి బ్యాక్.. బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ లను ఐసీఐసీఐ కొనుగోలు చేయటంతో పాటు.. వాటిని ట్రాక్ మీదకు తీసుకొచ్చింది.

అదే రీతిలో నష్టాల్లో ఉన్న ఐఎన్ జీ వైశ్యా బ్యాంకును కొనుగోలు చేసిన కోటక్ త్వరలోనే దాని రూపురేఖల్ని మార్చేసింది. ఈ నేపథ్యంలో కష్టంలో ఉన్న లక్ష్మీ విలాస్ బ్యాంకును ఈ రెండు బ్యాంకుల్లో ఏదో ఒక దాని సొంతం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి.. లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఎవరి సొంతమవుతుందో చూడాలి.