Begin typing your search above and press return to search.

అమెరికానే టెన్షన్ పెట్టిన కొరియా

By:  Tupaki Desk   |   25 March 2022 5:34 AM GMT
అమెరికానే టెన్షన్ పెట్టిన కొరియా
X
అగ్రరాజ్యం అమెరికాను ఉత్తర కొరియా టెన్షన్ పెట్టేసింది. కొత్త తరహా ఖండాంతర క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించగానే అమెరికా ఉలిక్కిపడింది. కొంతకాలంగా వరుసగా క్షిపణులను ప్రయోగిస్తున్న ఉత్తర కొరియా ఇలాంటి ఖండాంతర క్షిపణిని ప్రయోగించటం ఇదే మొదటిసారి. దాంతో అమెరికాలో టెన్షన్ మొదలైంది. ఒకవైపు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో నాటో కూటమి దేశాల సమావేశమయ్యాయి.సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది.

తాజాగా ప్రయోగించిన ఖండాంతర క్షిపణి ద్వారా వేల కిలోమీటర్ల దూరాన్ని కూడా ఉత్తర కొరియా ఛేదించగలదు. తాజా క్షిపణి ప్రయోగం వల్ల అమెరికాలోని ఏ రాష్ట్రంలోని టార్గెట్ ను అయినా ఉత్తర కొరియా చాలా సునాయాసంగా ధ్వంసం చేయగలదు. ఈ విషయం తెలియటంతోనే అమెరికాలో టెన్షన్ మొదలైపోయింది. పైగా ప్రయోగం కూడా నూరు శాతం సక్సెస్ అయినట్లు ఉత్తర కొరియా ప్రకటించటం పుండు మీద కారం రాసినట్లయ్యింది అమెరికాకు.

తాజా క్షిపణిని ఉత్తర కొరియా మాన్ స్టర్ మిస్సైల్ అని ముద్దుగా పిలుచుకుంటోంది. తాజా మిస్సైల్ 6200 కిలోమీటర్ల ఎత్తున 72 నిమిషాలు ప్రయాణించిన ఈ క్షిపణి చివరకు జపాన్ ఆధీనంలో ఉన్న సముద్రంలో కూలిపోయింది.

తాజా ప్రయోగంతో అమెరికాను ఉత్తర కొరియా ఛాలెంజ్ చేసినట్లుగానే ఉంది. అసలే ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాల మధ్య చీలిక వచ్చేసింది. యూరోపు దేశాలు, నాటో దేశాలు ఉక్రెయిన్ను సమర్ధిస్తున్నాయి.

ఇదే సమయంలో రష్యాకు చైనా, ఉత్తర కొరియా మద్దతుగా నిలుస్తున్నాయి. పైగా రెండు దేశాలు కూడా ఆయుధాల పరంగా చాలా బలంగా ఉన్న దేశాలు కావటం గమనార్హం.

దాంతో ఈ యుద్ధం నేపథ్యంలో భవిష్యత్తులో జరగరానిది ఏమైనా జరిగితే రష్యాకు మద్దతుగా చైనా, ఉత్తరకొరియా డైరెక్టుగా రంగంలోకి దిగితే పరిస్థితి ఏమిటనే విషయాన్ని ప్రపంచ దేశాలు అంచనా వేయలేకపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఉత్తర కొరియా ప్రయోగించిన మాన్ స్టర్ మిస్సైల్ దెబ్బ ప్రపంచ దేశాలపై చాలా తీవ్రంగానే పడింది. పైగా తమను అణ్వస్త్ర దేశంగా గుర్తించాలని ఉత్తర కొరియా డిమాండ్ తో ప్రపంచం విస్తుపోతోంది.