Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో అంత దారుణ ప‌రిస్థితి ఉంద‌ట‌

By:  Tupaki Desk   |   26 Jan 2018 11:15 AM GMT
తెలంగాణ‌లో అంత దారుణ ప‌రిస్థితి ఉంద‌ట‌
X
భావస్వేచ్ఛ కోసం పోరాడిన గ‌డ్డ‌లో ఇప్పుడు దారుణ ప‌రిస్థితి నెల‌కొంద‌న్న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు తెలంగాణ పొలిటిక‌ల్ జేఏసీ ఛైర్మ‌న్ కోదండం మాష్టారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో త‌మ ఆవేద‌న‌ను.. ఆవేశాన్ని మాట‌ల రూపంలోనూ.. సోష‌ల్ మీడియాలో వ్యాఖ్య‌ల రూపంలో వెల్ల‌డించి.. ప్ర‌జ‌ల్లో పోరాట స్ఫూర్తిని పెంచిన గ‌డ్డ‌లో ఇప్పుడు దారుణ ప‌రిస్థితి నెల‌కొంద‌న్న మాట‌ను కోదండం సార్ చెబుతున్నారు.

సోష‌ల్ మీడియాలో తెలంగాణ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఎవ‌రు కామెంట్ పెట్టినా అరెస్ట్ చేసే కుట్ర జ‌రుగుతోంద‌న్నారు. ప‌రుష ప‌ద‌జాలం పేరుతో అరెస్ట్ లు సాగుతున్న వేళ‌.. ఇంత‌కీ ప‌రుష ప‌ద‌జాలం అంటే ఏమిటి? దానికి కొల‌మానం ఏమిటి? రాజ‌కీయ క‌క్ష‌తో చేస్తున్న చ‌ర్య‌ల్ని తాను వ్య‌తిరేకిస్తున్న‌ట్లుగా కోదండం మాష్టారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాజ‌కీయ క‌క్ష‌తోనే ఉద్య‌మ‌.. రాజ‌కీయ నేత‌ల మీద అక్ర‌మంగా కేసులు పెడుతున్న‌ట్లు చెప్పారు. ప‌రుష ప‌ద‌జాలంతో దూషించార‌న్న పేరుతో కోర్టు అనుమ‌తి లేకుండా విచారించ‌ద‌గిన నేరంగా ప‌రిగ‌ణిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న నేప‌థ్యంలో కోదండం సార్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

రాజ్యాంగాన్ని అమ‌ల్లోకి తెచ్చిన రోజున ఈ త‌ర‌హా చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయ‌టాన్ని మాష్టారు తీవ్రంగా వ్య‌తిరేకించారు. అంద‌రికి స‌మాన అవ‌కాశాలు క‌ల్పించాల‌ని రాజ్యాంగం చెబుతోంద‌ని.. రాజ్యాంగంలో లోపం లేదు కానీ.. పాల‌కుల్లోనే లోపం ఉన్న‌ట్లు ఆయ‌న వ్యాఖ్యానించారు. మంద‌కృష్ణ మాదిగ‌.. ఒంటేరు ప్ర‌తాప్ రెడ్డి.. అద్దంకి ద‌యాక‌ర్ పై రాజ‌కీయ క‌క్ష‌తోనే కేసులు పెట్టార‌న్నారు.

ఐపీసీ చ‌ట్టంలోని 506.. 507 సెక్ష‌న్ల‌ను త‌ర‌చూ దుర్వినియోగం చేస్తున్నార‌న్నారు. ప‌రుష ప‌ద‌జాలం అంటే ఏమిటో చెప్పాల‌న్న డిమాండ్ చేశారు. రాజ‌కీయాలు మార‌కుండా తెలంగాణ ఉద్య‌మ ఆకాంక్ష‌లు నెర‌వేర‌వ‌న్నారు. తాము పెట్టే కొత్త పార్టీకి సంబంధించిన వివ‌రాలపై వ‌చ్చే నెల‌లో (ఫిబ్ర‌వ‌రి) చేయ‌నున్న‌ట్లు చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు కోసం భారీ ఉద్య‌మాన్ని న‌డిపిన గ‌డ్డ‌లో మాష్టారు చెప్పినంత దారుణ ప‌రిస్థితి ఉందా? అన్నది ప్ర‌శ్న‌గా మారింది. అయితే..దీనికి ఇటీవ‌ల కాలంలో చోటు చేసుకున్న అరెస్ట్ లను ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్న వైనం ఇప్పుడు కొత్త ఆందోళ‌న‌కు కార‌ణంగా మారిందంటున్నారు.