Begin typing your search above and press return to search.

ఊళ్లకు వెళుతున్న టీమంత్రులకు షాకుల మీద షాకులు

By:  Tupaki Desk   |   13 Sept 2019 3:17 PM IST
ఊళ్లకు వెళుతున్న టీమంత్రులకు షాకుల మీద షాకులు
X
రోజులన్ని మనవి కావని ఊరికే అనరు. కలిసి వచ్చే కాలాన్ని చూసి అదంతా తమ గొప్పతనమేనని ఫీలయ్యే వారికి ఎలాంటి ఎదురుదెబ్బలు పడతాయన్న దానికి నిదర్శనంగా తాజా పరిణామాల్ని చెప్పొచ్చు. తెలంగాణ అధికారపక్షం మీద ప్రజల్లో ఉన్న ఆగ్రహావేశాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. అయితే.. వీటికి బాధితులుగా మంత్రులు మారటంతో వారు అవాక్కు అవుతున్నారు.

తాజాగా పలువురు మంత్రులు తమ జిల్లాల పర్యటనల సందర్భంగా ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. పెద్దపల్లికి వెళ్లిన మంత్రి ఈటల రాజేందర్ ను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని పట్టుబట్టటమే కాదు.. మెడికల్ కాలేజీ ఏర్పాటు ఎందుకు చేయటం లేదని వారు మండిపడుతున్నారు.

ఈటల సాబ్ కు ఇలాంటి ఇబ్బంది ఎదురైతే.. మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ ను జగిత్యాల జిల్లా రైతులు అడ్డుకున్నారు. తమ పొలాలకు నీళ్లు ఎందుకు ఇవ్వరంటూ వారు మండిపడుతున్నారు. ఇదే జిల్లాలో మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు షాకింగ్ ఉదంతం ఎదురైంది. ఆయన కాన్వాయ్ ను తెలంగాణ ప్రజలు అడ్డుకున్నారు. రైతుల సమస్యల్ని ఎందుకు పట్టించుకోవటం లేదని వారు నిలదీశారు. చూస్తుంటే.. సారుకు మాదిరి.. బయటకు రాకుండా తమ పేషీలకు పరిమితమైతేనే బెటరా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.